జూ ఎన్టీఆర్ ని భయపెట్టిందెవరు?
ఎమోషనల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ సైతం భయానికి గురైయ్యాడు. ఆ భయానికి మాత్రం కారణం సాక్షాత్తు వి.వి.వినాయకే. ఇంతకీ ఎన్టీఆర్ని వినయ్ ఎలా భయపెట్టాడంటారా? అయితే మనం ఒకసారి 2001 కి వెళ్ళాల్సిందే. ఎందుకంటే ఈ సంఘటన అప్పటిదే కాబట్టి, 'సుబ్బు" షూటింగ్ కోసం న్యూజిలాండ్ లో వున్న ఎన్టీఆర్ అక్కడి షూటింగ్ లోకేషన్ కు కూసింత దూరంటో ఓ నల్లని భారీ ఆకారం తననే తదేకంగా చూస్తుండడం గమనించాడు. ఇలా రెండు మూడు సార్లు ఆ ఆకారాన్ని చూసిన ఎన్టీఆర్ ఒకానొక దశలో భయానికి గురైయ్యాడు.
అయితే అతన్ని దగ్గరికి పిలిపించుకున్నాక తెలిసింది....తన కోసం సినిమా తయారు చేసుకుని ఆ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యే అవకాశం పొందాలన్నదే అతని ఆశ అని. ఎన్టీఆర్ కు వివివినాయక్ చెప్పిన కథ నచ్చడంతో వెంటనే వారి కాంబినేషన్ లో 'ఆది" ప్రారంభమైనది. ఇక 'ఆది" ఎంతటి సెన్సేషనల్ చిత్రమైందో అందరికీ తెలిసిందే.


Click it and Unblock the Notifications











