twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కళ్యాణ్ రామ్ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ సీరియస్.. అన్న కోసం తప్పట్లేదు!

    |

    నందమూరి వారసులు ఎంత మంది ఉన్నా కూడా దాన్ని మరోస్థాయికి తీసుకువెళుతున్న వారిలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. టాలీవుడ్ లో బెస్ట్ టాలెంటెడ్ ఆల్ రౌండర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ ఎలాంటి పాత్రలో కనిపించినా సరైన న్యాయం చేయగలడని చెప్పవచ్చు. ఇక గత ఎడాది నుంచి ఎన్టీఆర్ తన అన్నయ్య కళ్యాణ్ రామ్ విషయంలో చాలా సీరియస్ గా ఆలోచిటున్నట్లు తెలుస్తోంది.

    ఎన్ని సినిమాలు చేస్తున్నా కూడా..

    ఎన్ని సినిమాలు చేస్తున్నా కూడా..

    కళ్యాణ్ రామ్ హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పుడప్పుడు బయట హీరోలతో కూడా ప్రయోగాలు బాగానే చేస్తున్నాడు గాని పెద్దగా కలిసి రావడం లేదు. పటాస్ సినిమా అనంతరం ఇంతవరకు సరైన సక్సెస్ అందుకోలేదు. వరుసగా డిజాస్టర్స్ ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రమోషన్స్ కి ఎన్టీఆర్ క్రేజ్ ని వాదుకున్నా కూడా ఫలితం దక్కలేదు.

    అన్నయ్య కోసం కథలు వింటున్న తారక్

    అన్నయ్య కోసం కథలు వింటున్న తారక్

    అయితే జూనియర్ ఎన్టీఆర్ అన్నయ్యకు సినిమాలు కొంచెం ఆలోచించి సెలెక్ట్ చేసుకోవాలని చర్చించినట్లు తెలుస్తోంది. ఇక ఎవరైనా దర్శకులు వద్ద కథలు ఉంటే చెప్పాలని ఇటీవల సీనియర్ టెక్నీషియన్స్ కి ఒక నోట్ కూడా ఇచ్చాడట. కొత్త దర్శకులైనా పరవాలేదు. కథ నచ్చితే ముందు తనకు చెప్పాలని ఎన్టీఆర్ క్లారిటీగా చెప్పేశారట. దీంతో తెలిసినవాళ్ళు కథలు బాగానే చెబుతున్నా తారక్ కి నచ్చడం. లేదట.

    నిర్మాతలను కూడా లైన్ లో పెడుతున్నాడు

    నిర్మాతలను కూడా లైన్ లో పెడుతున్నాడు

    ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ ని లైన్ లో పెట్టిన తారక్ తన అన్నయ్యతో ఒక సినిమా చేయాలని మాట తీసుకున్నాడట. కథ ఉంటే తనకు చెప్పాలని రిక్వెస్ట్ కూడా చేశారట. అలాగే మరికొంతమంది నిర్మాతలకు కూడా హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ మాటలకు నిర్మాతలు కూడా చాలా పాజిటివ్ గా స్పందించినట్లు తెలుస్తోంది.

    కళ్యాణ్ రామ్ కంటే ముందు తారక్ కథ వినాల్సిందే..

    కళ్యాణ్ రామ్ కంటే ముందు తారక్ కథ వినాల్సిందే..

    ఇక కళ్యాణ్ రామ్ తో హిట్టు కొడితే భవిష్యత్తులో తారక్ తో సినిమా చాలా ఈజీగా దొరుకుతుందని చెప్పవచ్చు. అయితే ముందుగా ఏదైనా కథ వస్తే అన్నకు సెట్టవుతుందా లేదా అనే ఆలోచిస్తున్నాడట తారక్. అప్పట్లో రైటర్ వక్కంతం వంశీ ఒక కథ చెప్పినట్లు రూమర్స్ వచ్చాయి గాని ఎందుకో వర్కౌట్ కాలేదు. ఇక ఎలాగైనా వీలైనంత త్వరగా అన్నకు తన ద్వారా మంచి బాక్సాఫీస్ హిట్ సినిమా రావాలని జూనియర్ ఎన్టీఆర్ ఎదురుచూస్తున్నట్లు సమాచారం.

    English summary
    RRR is a big budget movie awaited not only by Telugu fans but all over the world by Indian movie lovers. It goes without saying that the expectations on this film are in any range. The latest Komuram Beam teaser has also increased the dose of expectations. Director Rajamouli's way of thinking is once again very clear.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X