45 కోట్లు...14 దేశాలతో జూ ఎన్టీఆర్ స్ట్రాటజీ
జూ ఎన్టీఆర్, మెహర్ రమేష్ కాంబినేషన్లో రూపొందనున్న అశ్వనీదత్ భారీగానే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. శక్తి టైటిల్ తో రూపొందనున్న ఈ చిత్రాన్ని 14 దేశాల్లో డిఫరెంట్ లొకేషన్స్ లో చిత్రీకరించాలని అనుకుంటున్నారు. అలాగే ఈ చిత్రానికి దాదాపు 45 కోట్లు దాకా ఖర్చుపెట్టడానికి అశ్వనీదత్ ముందుకొచ్చారని తెలుస్తోంది. ఈ చిత్రంలో ఇలియానా హీరోయిన్ గా చేస్తోంది. ఇక మెహర్ రమేష్, ఎన్టీఆర్,అశ్వనీదత్ కాంబినేషన్ లో గతంలో కంత్రి చిత్రం వచ్చింది. సినిమా పెద్దగా వర్కవుట్ కాకపోయినా దర్శకుడుగా మెహర్ కు మంచి పేరే తెచ్చిపెట్టింది. అనంతరం ప్రభాస్ తో చేసిన భిళ్ళా రీమేక్ తో అతను స్టైలిష్ దర్శకుడు అనే ముద్ర వేయించుకున్నాడు. అందులోనూ ఎన్టీఆర్ అతనితో మళ్ళీ చేయటానిక మోజు చూపటంతో ఈ ప్రాజెక్టు ఫైనలైజ్ అయింది.
త్వరలో వారణాసిలో ఈ చిత్రం షూటింగ్ మొదలుపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అశ్వనీదత్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'ఇంద్ర' షూటింగ్ కూడా అప్పట్లో వారణాసిలోనే మొదలైంది. వారణాసితో పాటు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాలు, విదేశాల్లో కూడా 'శక్తి' చిత్రం షూటింగ్ కు ప్లాన్ చేస్తున్నారు. 'రాఖీ' చిత్రంలో ఎన్టీఆర్ కు జోడిగా నటించిన ఇలియానా ఈ కొత్త చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైంది. ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, మణిశర్మ సంగీతం అందించబోతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్..మున్నా దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో బృందావనం చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. అలాగే ఎన్టీఆర్,వివివినాయిక్ కాంబినేషన్లో రూపొందిన అదుర్స్ చిత్రం ఈ డిసెంబర్ నెలలోనే రిలీజ్ కానుంది.


Click it and Unblock the Notifications











