ఎన్టీఆర్ 'శక్తి' చిత్రం రిలీజ్ డేట్ ఎప్పుడంటే...
ఎన్టీఆర్, మెహర్ రమేష్ కాంబినేషన్లో రెడీ అవుతున్న 'శక్తి' చిత్రాన్ని డిసెంబర్ 24, నవంబర్ 2010న రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రం ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ తమ వైజయంతీ మూవీస్ పతాకంపై భారీ బడ్జెట్ తోనిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నటించడం చాలా హ్యాపీగా ఉందనీ, ఇదొక పవర్ ఫుల్ కథ అనీ ఎన్టీఆర్ అంటున్నారు తన కెరీర్ లోనే ఇది సెన్సేషనల్ ప్రాజెక్ట్ అవుతుందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ కు జోడిగా ఇలియానా నటిస్తున్న ఈ చిత్రానికి యండమూరి వీరేంద్రనాథ్, జె.కె.భారవి, తోటప్రసాద్, డి.ఎస్.కన్నన్ రచనా సహకారం, సత్యానంద్ మాటలు, సిరివెన్నెల-రామజోగయ్య శాస్త్రి పాటలు, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రంతో పాటు దిల్ రాజు నిర్మాతగా బృందావనం చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న 'బృందావనం' చిత్రం ఆగస్టు 15న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అదే రోజున ఎన్టీఆర్ హీరోగా చేసిన 'యమదొంగ' రిలీజైంది.


Click it and Unblock the Notifications











