జూ ఎన్టీఆర్ ‘శక్తి’ స్టోరీ లైన్ ఏంటంటే...?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా 'కంత్రి' ఫేమ్ మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ సి. అశ్వనీదత్ వైజయంతీ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం 'శక్తి'. జూ ఎన్టీఆర్ సరసన ఇలియానా జంటగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ మనాలిలో శరవేగంగా జరుగుతోంది. కాగా ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ లైన్ బయటికి లీకయ్యింది. లీకయిన కథ ప్రకారం ఈ పినిమా యాక్షన్ ఓరియంటెడ్ గా రూపొందుతోందని చెప్పోచ్చు. జూ ఎన్టీఆర్ ఓ ఫవర్ ఫుల్ ఆయుధాన్ని వెతకడానికి రకరకాల ప్లేస్ లకు వెళతాడట.
ఆ ఆయుధం చాలా శక్తివంతమైనదిగా తెలుస్తోంది. ఎలాగైనా ఆ ఆయుధాన్ని సాధించి తీరాలే పట్టుదలతో దాన్ని వెతుక్కుంటూ వెళుతున్న ఎన్టీఆర్ రకరకాల ఆపాయాలను, అనుభవాలను ఎదుర్కొంటాడట. ఫైనల్ గా ఎన్టీఆర్ కు ఈ ఆయుధం దొరుకుతుందా లేదా? ఈ అపాయాలను దర్శకుడు మోహర్ రమేష్ చాలా అడ్వంచర్ గా చిత్రీకరించాడని సమాచారం. యంగ్‌టైగర్ ఎన్టీఆర్, ఇలియానా, పాటు ఇతర పాత్రల్లో జాకీష్రాఫ్, పూజాబేడి, సోనూసూద్, నాజర్, అలీ, కృష్ణభగవాన్‌లతో పాటు చాలామంది ప్రముఖ నటీనటులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు - సత్యానంద్, ఫోటోగ్రఫీ - సమీర్ రెడ్డి, సంగీతం - మణిశర్మ అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











