Jr NTR: మొదటిసారి అలాంటి పాత్రతో రిస్క్ చేయబోతున్న తారక్.. ఫ్యాన్స్ తట్టుకుంటారా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మొత్తానికి మొదటి పాన్ ఇండియా సినిమాతో తన టాలెంట్ ను దేశమంతా చూపించాడు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి నటించిన RRR సినిమా సంచలన విజయాన్ని అందుకోవడంతో ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కు బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థలు కూడా ఎన్టీఆర్ తో భవిష్యత్తు ప్రాజెక్టుల కోసం అగ్రిమెంట్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే స్టార్ట్ చేయబోయే సినిమాలో ఎవరూ ఊహించని పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అలాంటి పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ ని చూస్తే అభిమానులు తట్టుకుంటారా లేదా అనేది హాట్ టాపిక్ గా మారుతోంది. ఒకసారి ఆ వివరాల్లోకి వెళితే..

తొందర పడకుండా..

తొందర పడకుండా..

జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ మొదటిసారి కలిసి నటించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ RRR సంచలన విజయాన్ని అందుకుంది. ఈ ఇద్దరి హీరోల పేర్లు ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులతో పాటు త్వరలో మరికొన్ని ప్రాజెక్టులకు కూడా ఈ ఇద్దరు సంతకాలు చేసే అవకాశం ఉన్నట్లుగా బాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక రకాల వార్తలు వెలువడుతున్నాయి. ఇక ఈ స్టార్స్ మాత్రం తొందర పడకుండా వీలైనంతవరకూ డిఫరెంట్ కంటెంట్ తో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా కథలను సెలెక్ట్ చేసుకుంటున్నారు.

బరువు తగ్గుతున్న ఎన్టీఆర్

బరువు తగ్గుతున్న ఎన్టీఆర్

రామ్ చరణ్ ఇప్పటికే శంకర్ సినిమాను విడుదలకు సిద్ధం చేస్తూండగా జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి సినిమాను ఇంకా స్టార్ట్ అయితే చేయలేదు. కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లు ముందుగానే క్లారిటీ ఇచ్చాడు. ఆ సినిమాలో ఒక నేషనల్ పాయింట్ ను హైలెట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఉన్న బాడీ లాంగ్వేజ్ కంటే భిన్నంగా ఆ సినిమాలో కనిపిస్తాడట. అందుకోసం బరువు తగ్గనున్నట్లు తెలుస్తోంది.

మంచి సందేశంతో..

మంచి సందేశంతో..

ఒక సాధారణ వ్యక్తి కార్పోరేట్ లెవెల్ లో ఉన్న రాజకీయ నాయకులను ఎలా కంట్రోల్ చేశాడు అనే తరహాలో ఈ కథ కొనసాగుతుండగా దర్శకుడు కొరటాల శివ ఒక మంచి సందేశాన్ని కూడా ఈ సినిమాలో చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. కొరటాల శివ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో మరొక పాన్ ఇండియా సినిమా మొదలుపెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

 ఎన్టీఆర్ లిస్టులో టాలెంటెట్ దర్శకులు

ఎన్టీఆర్ లిస్టులో టాలెంటెట్ దర్శకులు

ఇక ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత ఎన్టీఆర్ లిస్టులో మరొక ఇద్దరు దర్శకులు కూడా ఉన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంతకు ముందు సినిమా చేయాలనుకొని క్యాన్సిల్ చేసుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఉప్పెన దర్శకుడు కూడా ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. అతనికి ప్రస్తుతం మిగతా హీరోల నుంచి ఆఫర్స్ వస్తున్నప్పటికీ కూడా ఎన్టీఆర్ సినిమా కోసమే రోజు స్క్రిప్ట్ పై హార్డ్ వర్క్ చేస్తున్నాడు. రెగ్యులర్ గా జూనియర్ ఎన్టీఆర్ తో టచ్ లో ఉన్నట్లు కూడా తెలుస్తోంది.

 అలాంటి పాత్రలో ఎన్టీఆర్

అలాంటి పాత్రలో ఎన్టీఆర్

ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం బుచ్చిబాబు దర్శకత్వంలో చేయబోయే సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ వికలాంగుడి పాత్రలో కనిపించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. హీరో పాత్రకు పుట్టుకతోనే అంగవైకల్యం సమస్య ఉంటుందట. అయినప్పటికీ అతని చుట్టూ ఉన్న సమస్యలను దాటి చివరికి ఎవరు సాధించలేని దాన్ని సాధించి ఎలా ఆకట్టుకున్నాడు అనే కథాంశంతో ఈ సినిమా తెరపైకి రాబోతున్నట్లు తెలుస్తుంది.

Recommended Video

Jr NTR As Peddi | Exciting Updates On NTR 31 | Filmibeat Telugu
ఆ బ్యాక్ డ్రాప్ లో..

ఆ బ్యాక్ డ్రాప్ లో..

ఇంతకుముందు ఈ సినిమా విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఒక ఆట నేపథ్యంలో తెరకెక్కబోతున్నట్లు రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే రూమర్స్ ఎన్ని వస్తున్న కూడా దర్శకుడు ఇంతవరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. స్క్రిప్ట్ మొత్తం పూర్తి అయితే ఆ ప్రాజెక్టు పై అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇవ్వాలి అని ఎన్టీఆర్ చూస్తున్నాడు. మరి జూనియర్ ఎన్టీఆర్ ను బుచ్చిబాబు ఎప్పుడు మెప్పిస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X