బావమరిది ఎంట్రీ కోసం జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ ఫోకస్.. కథ కూడా ఫైనల్..
జూనియర్ ఎన్టీఆర్ నందమూరి బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాడు. అగ్ర దర్శకులు తనతో సినిమా చేసేలా తనను తాను అప్గ్రేడ్ చేసేసుకున్నాడు. ఇక తారక్ సపోర్ట్ తో ఒక కుర్ర హీరో ఇండస్ట్రీలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అతను మరెవరో కాదు. తారక్ సతీమణి లక్ష్మీ ప్రణతి సోదరుడు. అతనిని మంచి హీరోగా పరిచయం చేయించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

బావమరిది కెరీర్ కోసం
ప్రతి సినిమాకు సరికొత్త బాడీ లాగ్వేజ్ ను చూపిస్తూ జనాలను అమితంగా ఆకట్టుకునే జూనియర్ ఎన్టీఆర్ పెద్దగా వివాదాల్లోకి వెళ్ళాడు. ఎవరైనా సలహాలు తీసుకోవడానికి వస్తే మొహమాటం లేకుండా తనదైన శైలిలో టిప్స్ అందిస్తూ ఉంటారు. ఇక మొదటిసారి అంతకుమించి అనేలా బావమరిది కెరీర్ కోసం ఫోకస్ పెట్టినట్లు టాక్ వస్తోంది.

ఎన్టీఆర్ ఇంట్లోనే బావమరిది
లాక్ డౌన్ లో ఖాళీగానే ఉండడంతో ఎక్కువగా తారక్ తన కుటుంబ సభ్యుల కోసమే సమయాన్ని కేటాయించాడు. తన ఇద్దరు పిల్లలతో రోజు ఇంట్లో సందడి సందడిగా గడుపుతున్నాడు. ఇక లక్ష్మీ ప్రణతి సోదరుడు నార్నే నితిన్ చంద్ర కూడా వారితోనే ఉండేవాడట. రోజు బావతో వర్కౌట్స్ చేయడమే కాకుండా సినిమాకు సంబంధించిన ఎన్నో అనుభవాలు షేర్ చేసుకునేవాడట.

అంతకంటే ఎక్కువగా
ఇక అంతకుముందే యాక్టింగ్ కోర్స్ తీసుకున్న నితిన్ చంద్ర బావ ఎన్టీఆర్ దగ్గరకు వచ్చిన తరువాత అంతకంటే ఎక్కువగా నేర్చుకున్నాడట. ఇక హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సమయం వచ్చిందని తారక్ చెప్పగానే నితిన్ తండ్రి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. సొంత ప్రొడక్షన్ లోనే సినిమా చేయాలని తారక్ సలహాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

మొదటి కథ ఫిక్స్ చేసిన తారక్
అసలైతే తేజ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సింది. చిత్రం సీక్వెల్ లో నటిస్తున్నట్లు ఆ మధ్య టాక్ అయితే వచ్చింది. మరి ఎందుకో గాని అది వర్కౌట్ కాలేదు. ఇక మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ ఒక టాలెంటెడ్ దర్శకుడి చేత కథ రెడీ చేయించడాని టాక్ వస్తోంది. సినిమా స్టార్ట్ అయ్యే ముందు దర్శకుడితో కొంత ట్రావెల్ అవ్వాలని కూడా బావమరిదికి సలహా ఇచ్చాడట. త్వరలోనే ఆ వివరాలపై అఫీషియల్ క్లారిటి ఇవ్వనున్నారు. మరి మొదటి సినిమాతో నితిన్ చంద్ర ఎంతవరకు నిలదొక్కుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











