యంగ్ టైగర్ మీసాలు తీసేస్తే...
జూ ఎన్టీఆర్ హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'శక్తి" సినిమాలో ఇలియానా కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో నటించడం పట్ల తనకు చాలా ఆనందంగా ఉందని, ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుందని ఇలియానా అంటోంది. సినిమా బాగా వచ్చిందని, ప్రేక్షకులకు గ్రాండ్ ఫీస్ట్ అవుతుందని కూడా ఇలియానా చెబుతోంది. దీన్ని బట్టి ఇలియానా ఈ సినిమా సక్సెస్ విషయంలో ఎంత గట్టి నమ్మకాన్ని పెంచుకుందో చెప్పొచ్చు. ఇలియానా కాన్ఫిడెన్స్ చూసినవారు యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఇలియానా కాంబినేషన్ లో రాబోయే 'శక్తి" చిత్రం సంచలన విజయం సొంతం చేసుకుంటుందని మాట్లాడుకుంటున్నారు.
ఇదిలా ఉండగా జూ ఎన్టీఆర్ హీరోగా మరో చిత్రం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న 'బృందావనం" చిత్రంలో ఎన్టీఆర్ ఓ స్సెషల్ గెటప్ వేస్తున్నాడు. ఈ గెటప్ కోసం మీసాలు తీయాల్సి ఉందట. అందుకే ఈ సీన్ లను ఇంకా చిత్రీకరించలేదని వినికిడి. షూటింగ్ మొత్తం పూర్తయిన తర్వాత మిగతా సినిమా షెడ్యూల్ ను కూడా పరిగణలోకి తీసుకుని కృష్ణుడి గెటప్ కోసం మీసాలు తీయాలనుకుంటున్నాడట ఎన్టీఆర్. అక్టోబర్ 1వ తారీఖున సినిమా విడుదలవ్వనుంది కాబట్టి ఈ నెలలో ఏదో ఒక రోజు మీసాలు తీసెసి జూ ఎన్టీఆర్ ఈ సీన్స్ చేస్తాడని సమాచారమ్ కృష్ణుడు గెటప్ లో జూ ఎన్టీఆర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాడని చెప్పొచ్చు.


Click it and Unblock the Notifications











