జూనియర్ ఎన్టీఆర్ కు బాలకృష్ణ ప్రత్యేక ఆహ్వానం.. ఇక అభిమానులకు పండగే!
మొత్తానికి అక్కినేని ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ హీరోలు మల్టీస్టారర్ సినిమాలతో వారి అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇక మల్టీస్టారర్ కాంబోలలో కేవలం నందమూరి వారు మాత్రమే మిగిలి ఉన్నారు. వీరి కాంబినేషన్ లో సినిమా వస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డ్ లు మరొక లెవెల్ లో ఉంటాయి అని చెప్పవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే మామూలుగా ఉండదు. సాధారణంగా మీడియా ముందుకు వస్తేనే అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ సెట్ చేస్తాయి. ఇక వెండి తెరపై కనిపిస్తే మాత్రం మామూలుగా ఉండదు అని చెప్పవచ్చు. ఆ రోజు కోసం నందమూరి అభిమానులు మాత్రమే కాకుండా ఇతర హీరోల అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవల బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ కు ప్రత్యేకంగా ఒక ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది.

పాన్ ఇండియా మార్కెట్
నందమూరి వారసులలో ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ అత్యధిక మార్కెట్ తో కొనసాగుతున్న విషయం తెలిసిందే. సీనియర్ ఎన్టీఆర్ అనంతరం నందమూరి వారసత్వాన్ని తన భుజాలపై వేసుకున్న బాలకృష్ణ ఒకే తరహా లో ముందుకు సాగుతున్నారు
ఇక జూనియర్ ఎన్టీఆర్ మాత్రం అంతకుమించి అనేలా సినిమాల పాన్ ఇండియా వరకు తన మార్కెట్ ను పెంచుకుంటూ వచ్చాడు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా జూనియర్ ఎన్టీఆర్ పేరు హాట్ టాపిక్ గా మారింది.

నందమూరి మల్టీస్టారర్ వస్తే మాత్రం
ఇక జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ ఒకే ఫ్రేమ్ లో కనిపించడం అంటే అది చాలా రేర్ అని చెప్పాలి. మిగతా హీరోల మాదిరిగా వీరు అయితే ఎక్కువగా బయట జనాలకు కనిపించారు. కారణాలు ఏవైనా కూడా అభిమానులు మాత్రం వారిని ఒకే ఫ్రేమ్లో చూడాలని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. గతంలో వీరి కాంబినేషన్లో సినిమా రాబోతున్నట్లు అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. కానీ ఇద్దరు హీరోలు మాత్రం ఒక్కసారి కూడా అఫీషియల్ గా క్లారిటీ అయితే ఇవ్వలేదు. నందమూరి మల్టీస్టారర్ వస్తే మాత్రం మామూలుగా ఉండదని చెప్పవచ్చు.

అఖండ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్
ఇక నందమూరి బాలకృష్ణ త్వరలోనే అఖండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తప్పకుండా బాక్సాఫీస్ వద్ద ఈ కాంబినేషన్ హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంటుందని ఇప్పటికే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా గ్రాండ్ గా నిర్వహించాలని చూస్తున్నారు.
Recommended Video

జూనియర్ ఎన్టీఆర్ కు ఆహ్వానం
అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం జూనియర్ ఎన్టీఆర్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ తారక్ కు ప్రత్యేకంగా ఆహ్వానం పంపినట్లు సమాచారం. అఖండ సినిమా డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక అంతకంటే వారం రోజుల ముందే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించాలని చూస్తున్నారు. రెండు రాష్ట్రాల నుంచి భారీ స్థాయిలో అభిమానులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఈ వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాడని సమాచారం. మరి ఈ వార్త ఎంతవరకు నిజం అవుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











