బావమరిది సినిమాను స్టార్ట్ చేయబోతున్న జూనియర్ ఎన్టీఆర్?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక హీరో రాబోతున్నట్లు గత కొంతకాలంగా ఒక న్యూస్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అతను మరెవరో కాదు. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి సోదరుడు నార్నె నితిన్ చంద్ర. గత ఏడాది నుంచి అతను నటనకు సంబంధించిన శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఫైనల్ గా సినిమాను జూనియర్ ఎన్టీఆర్ లాంచ్ చేస్తారని టాక్ వస్తోంది.

సీనియర్ డైరెక్టర్ తేజ డైరెక్ట్ చేయబోయే చిత్రం సీక్వెల్ చిత్రం 1.1లో నార్నె నితిన్ మెయిన్ హీరో అని టాక్ వస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 40మంది కొత్త నటీనటులతో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత జనరేషన్ రొమాంటిక్ లైఫ్ ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నట్లు టాక్. ఇక త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ తో సినిమాను లాంచ్ చేయనున్నట్లు సమాచారం.

Jr ntr special guest for brother in law first movie launch

అయితే లాంచింగ్ ఈవెంట్ కు జూనియర్ ఎన్టీఆర్ రాబోతున్నట్లు తెలుస్తోంది. సినిమా లాంచ్ ఏప్రిల్ 18న జరిగే అవకాశం ఉన్నట్లు టాక్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న తేజ సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేసి మూవీని ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని అనుకుంటున్నాడు. మరి సినిమాతో నితిన్ ఏ రేంజ్ లో సక్సెస్ అవుతాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X