Jr NTR ను కలవబోతున్న బీజేపీ అగ్ర నేత.. అక్కడ సీక్రెట్ మీటింగ్?
RRR సినిమా ద్వారా ఫ్యాన్ ఇండియా స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజెస్ ను కూడా అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు జాతీయస్థాయిలో కూడా అందరిని ఆకర్షిస్తున్నాడు. ఇక అతను భారత జనతా పార్టీకి చెందిన ఒక అగ్రనేతను కలుసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. గత రెండు మూడు రోజులుగా ఈ విషయంపై అనేక రకాల రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇక ఆదివారం రోజు వీరి మీటింగ్ కు టైం కూడా ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆ పాత్రకు ఫిదా
RRR సినిమా ద్వారా దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా జూనియర్ ఎన్టీఆర్ మంచి గుర్తింపును అందుకున్నాడు. ముఖ్యంగా రాజకీయ నాయకులు కూడా జూనియర్ ఎన్టీఆర్ నటనకు ఫిదా అవుతున్నారు. లోకల్ రాజకీయ నాయకుల కంటే కూడా ఇతర రాష్ట్రాలలోని అగ్ర రాజకీయ ప్రముఖులు RRR లోని కొమరం భీమ్ పాత్రను చూసి ప్రశంసలు కురిపించారు.

రాజకీయాలకు దూరంగానే..
అయితే జూనియర్ ఎన్టీఆర్ గత కొంతకాలం నుంచి రాజకీయాల వైపు ఏమాత్రం తిరిగి చూడడం లేదు. గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున కొన్నిసార్లు ప్రచారాలు కూడా చేసినప్పటికీ ప్రస్తుతమైతే ఆయన అటువైపు వెళ్లడం లేదు. వీలైనంతవరకు రాజకీయాలకు దూరంగానే ఉండాలి అనే తారక్ ఆలోచిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇక ఎన్టీఆర్ తన రాజకీయ స్నేహితులతో మాత్రం ఎప్పటికప్పుడు టచ్ లోనే ఉంటున్నాడు.

ఎంట్రీ ఇస్తాడా?
రాజకీయాలకు సంబంధించిన అంశాలు సినిమా జీవితంపై ఏమాత్రం ప్రభావం చూపకూడదు అని ఎన్టీఆర్ ఈ విధంగా ముందుకు సాగుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇక రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తాడా లేదా అనే విషయంలో గతంలోనే ఒక క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం అయితే తన ఫోకస్ మొత్తం కూడా సినిమాలపైనే ఉంది అని ఇప్పట్లో అలాంటి ఆలోచన అయితే లేదు అని ఎన్టీఆర్ వివరణ ఇచ్చాడు. అలాగని పూర్తిగా రాజకీయాల్లోకి రాను అని కూడా తారక్ తెలియజేయలేదు.

అగ్రనేత ప్రశంసలు
ఇక RRR సినిమా ద్వారా జూనియర్ ఎన్టీఆర్ బిజెపి అగ్ర నేతల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నాడు. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ చలచక్కగా నటించాడు అని అతని నటనకు మంత్రముగ్ధుడిని అయ్యాను కూడా బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా మెచ్చుకోవడం అప్పట్లో మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పుడు ఆయన ఎన్టీఆర్ ను కలవబోతున్నట్లుగా కూడా కథనాలు వెలువడుతున్నాయి. కొమరం భీమ్ పాత్రలో నటించిన విధానానికి ఆయన ప్రశంసలు అందించేందుకే కలవడానికి రెడీ అయినట్లు టాక్.

అక్కడ మీటింగ్?
జూనియర్ ఎన్టీఆర్ నటనకు ఫిదా అయిపోయిన అమిత్ షా ఆయనను ప్రత్యేకంగా కలుసుకోవాలి అని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒక కేంద్ర హోమ్ మంత్రి బాధ్యతలో ఉన్న అమిత్ షా ఎన్టీఆర్ ను కలవడానికి రెడీ అవుతున్నారు అనగానే మీడియాలో ఈ వార్త హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రత్యేకంగా రామోజీ ఫిలిం సిటీలో సాయంత్రం 6 గంటలకు ఎన్టీఆర్ తో మీటింగ్ ఏర్పాటు చేసినట్లుగా సమాచారం. అయితే ఈ మీటింగ్ పై ఇంతవరకు అఫీషియల్ గా ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అఫీషియల్ గా క్లారిటీ వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.


Click it and Unblock the Notifications











