సెన్సేషన్: సలార్ 2లో జూనియర్ ఎన్టీఆర్.. అలా సర్‌ప్రైజ్ చేయబోతున్న ప్రశాంత్ నీల్
బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తోనే సినిమాల్లోకి వచ్చినా.. ఆరంభంలోనే టాలీవుడ్‌లో బడా హీరోగా హవాను చూపించి.. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు ప్రభాస్. అప్పటి నుంచి భారీ బడ్జెట్ చిత్రాల్లో మాత్రమే నటిస్తోన్న అతడు.. విజయాలను మాత్రం పెద్దగా అందుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది 'సలార్: సీజ్‌ఫైర్' చిత్రం చేశాడు.
రెబెల్ స్టార్ ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందిన 'సలార్: సీజ్‌ఫైర్' మూవీకి ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. అదే సమయంలో ప్రభాస్‌ను మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కించింది. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్‌గా రాబోతున్న 'సలార్: శౌర్యాంగ పర్వం'పై అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోతూనే ఉన్నాయి.

'సలార్: సీజ్‌ఫైర్' సూపర్ హిట్ అవడంతో దీనికి సీక్వెల్‌గా 'సలార్: శౌర్వాంగ పర్వం' మూవీని రూపొందిస్తున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. కానీ, ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది అన్న దానిపై క్లారిటీ ఇవ్వలేదు. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రం మే చివర్లో లేదా జూన్ నెలలో ప్రారంభం అయ్యే అవకాశం ఉందని ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
రెబెల్ స్టార్ ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న 'సలార్: శౌర్యాంగ పర్వం' మూవీకి సంబంధించి ఎన్నో రకాల అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఇందులో మరికొందరు పాన్ ఇండియా రేంజ్ ఆర్టిస్టులను నటింపజేయాలని ప్రయత్నాలు జరుగుతన్నాయి. ఇలా ఇప్పటికే పలువురిని ప్రశాంత్ నీల్ ఎంపిక చేసుకున్నాడని అంటున్నారు.

వైల్డ్ యాక్షన్‌తో రూపొందుతోన్న 'సలార్: శౌర్యాంగ పర్వం' మూవీలో జూనియర్ ఎన్టీఆర్ కూడా కనిపించబోతున్నాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. నిజంగానే తారక్ ఈ సినిమాలో దర్శనమిస్తాడట. క్లైమాక్స్‌లో వచ్చే ఓ సీక్వెన్స్‌లో ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుందని, అది ప్రశాంత్ నీల్ తదుపరి సినిమాకు ఆరంభం అని అంటున్నారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయికి పెరిగిపోతోన్నాయి.
ఇదిలా ఉండగా.. 'సలార్ 2' చిత్రాన్ని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా చేస్తుండగా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేస్తున్నారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం ఇస్తున్నాడు. శ్రీయా రెడ్డి, బాబీ సింహా, ఈశ్వరీ రావు, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











