Devara మూవీ గ్లింప్స్ డేట్ ఫిక్స్.. భారత సినీ చరిత్రలోనే తొలిసారిగా!
సాధారణంగా ఏ స్టార్ హీరోకు అయినా ఒక్క హిట్ వస్తే అతడి రేంజ్ ఏ మేర పెరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి వరుసగా హిట్లు వస్తే దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అవుతుంటారు. ఇప్పుడలాంటి స్టేజ్‌లోనే ఉన్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా వరుసగా ఆరు హిట్లను అందుకున్న అతడు గ్లోబల్ స్టార్‌గానూ మారిపోయాడు.
కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు బడా డైరెక్టర్ కొరటాల శివతో 'దేవర' అనే సినిమాను చేస్తున్నాడు. కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో హై ఓల్టేజ్ యాక్షన్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. దీనికి సంబంధించిన షూటింగ్‌ను గత మార్చిలోనే మొదలు పెట్టారు. అప్పటి నుంచి వరుసగా షెడ్యూళ్లను ప్లాన్ చేసుకుంటూ చాలా వరకూ చిత్రీకరణను పూర్తి చేసేశారు.

సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'దేవర' మూవీని రెండు భాగాలుగా రూపొందిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో మొదటి పార్టును వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో జనవరి నుంచే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించాలని యూనిట్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఫుల్ లెంగ్త్ యాక్షన్‌తో రూపొందుతోన్న 'దేవర' మూవీ నుంచి ఇప్పటి వరకూ కొన్ని పోస్టర్లు మాత్రమే వచ్చాయి. దీనిపై నందమూరి ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ చిత్రం నుంచి గ్లింప్స్ వీడియోను విడుదల చేయబోతున్నట్లు తెలిసింది. దీన్ని నూతన సంవత్సర కానుకగా జనవరి 1 విడుదల చేయాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయినట్లు తెలిసింది.

ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న 'దేవర' మూవీ నుంచి రాబోయే గ్లింప్స్‌ను ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే ఎవరూ చూపించని విధంగా కట్ చేస్తున్నట్లు తెలిసింది. దీని ద్వారానే ఈ సినిమా రేంజ్ ఎలా ఉండబోతుంది అనేది చూపించబోతున్నారట. ఇప్పటికే దీనికి సంబంధించిన వర్క్ దాదాపుగా పూర్తైనట్లు తెలిసింది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం.
ఇదిలా ఉండగా.. 'దేవర' మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో జాన్వీ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.


Click it and Unblock the Notifications











