పవన్ ఫ్యాన్స్‌కు షాకివ్వబోతున్న ఎన్టీఆర్.. బాక్సాఫీస్ బెండు తీసేలా ప్లాన్
సాధారణంగా ఏ హీరో అయినా హిట్ కొడితే రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తాడు. కానీ, వరుసగా హిట్లు మీద హిట్లు.. హిట్లు మీద హిట్లు కొడుతుంటే ఏ రేంజ్‌లో దూసుకుపోతాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడిదే చేసి చూపిస్తున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఈ మధ్య కాలంలో ఏకంగా ఆరు విజయాలు సాధించిన అతడు.. ఇప్పుడు 'దేవర' సినిమాను చేస్తున్నాడు.
భీకరమైన ఫామ్‌లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న చిత్రమే 'దేవర'. కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో హై రేంజ్ యాక్షన్‌తో రాబోతోంది. దీంతో దీనిపై అంచనాలు ఆకాశం అంత ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ మూవీని తీస్తున్నారు. అంతేకాదు, దీన్ని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్లు కూడా అనౌన్స్ చేశారు.

'జనతా గ్యారేజ్' సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ - కొరటాల కాంబోలో రాబోతున్న 'దేవర' మూవీకి సంబంధించిన షూటింగ్ గత ఏడాదిలోనే ప్రారంభమైంది. అప్పటి నుంచి అస్సలు విరామం లేకుండా చిత్రీకరణను జరుపుతున్నారు. ఇలా ఇప్పటికే 85 శాతం కంటే ఎక్కువగానే టాకీ పార్టును పూర్తి చేశారు. మిగిలిన దాన్ని కూడా త్వరగానే కంప్లీట్ చేసేలా ప్లాన్లు చేసుకుంటున్నారు.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'దేవర' మూవీ మొదటి భాగాన్ని ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ, షూటింగ్ ఆలస్యం కావడంతో దీన్ని అక్టోబర్ 10 తేదీకి పోస్ట్‌పోన్ చేసేశారు. దీంతో అభిమానులు నిరాశ చెందారు. ఈ పరిస్థితుల్లో ఈ సినిమా రిలీజ్ డేట్ మరోసారి మారినట్లు ఇటీవలే ఓ న్యూస్ బయటకు వచ్చింది.

'దేవర' మూవీ రిలీజ్‌పై తాజాగా మరో క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. దీని ప్రకారం.. ఈ చిత్రాన్ని రెండు వారాలు ముందుకు అంటే అక్టోబర్ 10 నుంచి సెప్టెంబర్ 27వ తేదీకి ప్రీపోన్ చేస్తున్నారట. అప్పుడు రావాల్సిన పవన్ కల్యాణ్ OG వాయిదా పడుతుండడంతో 'దేవర' టీమ్ ఈ డేట్‌ను లాక్ చేసుకుందని తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈ రెండు రోజుల్లోనే వస్తుందని తాజాగా తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. డిఫరెంట్ యాక్షన్‌తో రూపొందుతోన్న 'దేవర' మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో జాన్వీ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇందులో శ్రీకాంత్, చాకో సహా తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











