Devara Postpone: ఎన్టీఆర్ మూవీ వాయిదా.. దేవర కొత్త రిలీజ్ డేట్ ఇదే!

యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ తెలుగు చిత్ర పరిశ్రమలో సుదీర్ఘ కాలంగా స్టార్‌ హీరోగా హవాను చూపిస్తున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. దీనికితోడు ఈ మధ్య కాలంలో అతడు వరుసగా ఆరు విజయాలను ఖాతాలో వేసుకుని ఫుల్ ఫామ్‌తో దూసుకెళ్తున్నాడు. ఈ జోష్‌లోనే ఇప్పుడు తారక్ 'దేవర' అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు.

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న సినిమానే 'దేవర'. కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో హై రేంజ్ యాక్షన్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. దీంతో దీనిపై అంచనాలు క్రమంగా పెరుగుతున్నాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ చిత్రాన్ని తీస్తున్నారు. ఫలితంగా ఈ మూవీపై హైప్ తారాస్థాయిలో పెరిగిపోతూనే ఉందని చెప్పాలి.

Jr NTR Starrer Devara Movie Release Postponed to August 15th

సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో రాబోతున్న 'దేవర' మూవీకి సంబంధించిన షూటింగ్ గత ఏడాదిలోనే మొదలైంది. అప్పటి నుంచి అస్సలు బ్రేకులు లేకుండానే చిత్రీకరణను జరుపుతున్నారు. ఇలా ఇప్పటికే 85 శాతం కంటే ఎక్కువగానే టాకీ పార్టును కంప్లీట్ చేసినట్లు తెలిసింది. మిగిలిన దాన్ని కూడా పూర్తి చేసి సినిమాను అనుకున్న టైంకు తీసుకు రావాలని చూస్తున్నారు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కలయికలో రాబోతున్న 'దేవర'ను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. అందులో మొదటి దాన్ని ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే చిత్ర యూనిట్ ఏర్పాట్లు కూడా చేస్తోంది. అయితే, ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీటిని చిత్ర యూనిట్ ఖండించినా కూడా ఇవి ఆగట్లేదు.

Jr NTR Starrer Devara Movie Release Postponed to August 15th

'దేవర' మూవీ రిలీజ్‌పై తాజాగా మరో షాకింగ్ న్యూస్ లీకైంది. దీని ప్రకారం.. ఈ చిత్రాన్ని నిజంగానే వాయిదా వేస్తున్నారట. ఏపీలో ఎన్నికలు రావడం, అనిరుథ్ నుంచి మ్యూజిక్ లేట్ అవడం వల్లే చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. అంతేకాదు, 'దేవర' మూవీని ఆగస్టు 15వ తేదీన విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు కూడా మరో న్యూస్ బయటకు వచ్చింది.

ఇదిలా ఉండగా.. క్రేజీ కాన్సెప్టుతో రూపొందుతోన్న 'దేవర' మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో జాన్వీ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇందులో శ్రీకాంత్, చాకో సహా తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X