పవన్ కల్యాణ్ ప్లేస్‌లోకి జూనియర్ ఎన్టీఆర్.. ఒకే ఒక్క పోస్టుతో మొత్తం లీక్
తెలుగు చిత్ర పరిశ్రమలో యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ ఎంతో కాలంగా స్టార్ హీరోగా హవాను చూపిస్తున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. దీనికితోడు ఈ మధ్యన అతడు వరుసగా హిట్లు మీద హిట్లను ఖాతాలో వేసుకుని ఫుల్ ఫామ్‌తో ముందుకెళ్తున్నాడు. ఈ జోష్‌లోనే ఇప్పుడు తారక్ 'దేవర' అనే పాన్ ఇండియా మూవీని చేస్తున్నాడు.
టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న చిత్రమే 'దేవర'. కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో హై రేంజ్ యాక్షన్‌తో ఈ సినిమా రూపొందుతోంది. దీంతో దీనిపై అంచనాలు తారాస్థాయిలో పెరుగుతున్నాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ మూవీని తీస్తున్నారు. అంతేకాదు, దీన్ని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్లు కూడా ప్రకటించారు.

హిట్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'దేవర' మూవీకి సంబంధించిన షూటింగ్ గత ఏడాదిలోనే ప్రారంభమైంది. అప్పటి నుంచి అస్సలు విరామం లేకుండా చిత్రీకరణను జరుపుతున్నారు. ఇలా ఇప్పటికే 85 శాతం కంటే ఎక్కువగానే టాకీ పార్టును కంప్లీట్ చేసినట్లు తెలిసింది. మిగిలిన దాన్ని కూడా పూర్తి చేసి సినిమాను అనుకున్న టైంకు తీసుకు రావాలని చూస్తున్నారు.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కలయికలో రాబోతున్న 'దేవర' మూవీ ఫస్ట్ పార్టును ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ, షూటింగ్ ఆలస్యం కావడంతో దీన్ని అక్టోబర్ 10 తేదీకి వాయిదా వేశారు. దీంతో ఫ్యాన్స్ డీలా పడిపోయారు. ఈ పరిస్థితుల్లో తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ మారిందని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.
'దేవర' మూవీ రిలీజ్‌పై తాజాగా మరో సర్‌ప్రైజింగ్ న్యూస్ లీకైంది. దీని ప్రకారం.. ఈ చిత్రాన్ని రెండు వారాలు ముందుకు జరిపి రిలీజ్ చేయబోతున్నారట. అంటే అక్టోబర్ 10 నుంచి సెప్టెంబర్ 27వ తేదీకి ఇది ప్రీపోన్ అయిందట. అప్పుడు రావాల్సిన పవన్ కల్యాణ్ OG వాయిదా పడుతుండడంతో 'దేవర' టీమ్ ఈ డేట్‌ను లాక్ చేసుకుందని ఓ పోస్ట్ ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఇదిలా ఉండగా.. హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందుతోన్న 'దేవర' మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో జాన్వీ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇందులో శ్రీకాంత్, చాకో సహా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











