Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు కొరటాల బిగ్ షాక్.. సూపర్ హిట్ సాంగ్‌తో పాటు ఆ సీన్స్ అన్నీ కట్

తెలుగు సినీ రంగంలో తనదైన రీతిలో ప్రభావాన్ని చూపిస్తూ స్టార్ హీరోగా దూసుకుపోతోన్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఇలా చాలా ఏళ్లుగా ఆల్‌రౌండ్ యాక్టింగ్‌తో ఇరగదీస్తోన్న అతడు.. వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ సత్తా చాటుతోన్నాడు. ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్టార్‌గానూ మారి హవాను చూపిస్తున్నాడు. ఇలా ఇప్పుడు ఎన్టీఆర్ 'దేవర' అనే సినిమాను చేస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ చిత్రం రన్ టైమ్ గురించి తాజాగా ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఆ సంగతులేంటో మీరే చూసేయండి మరి!

దేవరగా వస్తున్న ఎన్టీఆర్
పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ హీరోగా నటించిన మూవీనే 'దేవర'. కొరటాల శివ తీసిన ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందించాడు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటించాడు. ఇందులో శ్రీకాంత్, చాకో కీలక పాత్రలు చేశారు.

Jr NTR Starrer Devara Movie Run Time Reduced by 18 minutes

అంతటా ఎన్టీఆర్ హవా

'జనతా గ్యారేజ్' తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'దేవర' మూవీని సెప్టెంబర్ 27వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్‌ను సైతం రిలీజ్ చేశారు. అలాగే, ఇండియా వైడ్‌గా కొన్ని ఈవెంట్లను కూడా ప్లాన్ చేశారు. దీనికితోడు ఓవర్సీస్‌లో టికెట్ల బుకింగ్ కూడా మొదలైంది. దీంతో ఎన్టీఆర్ హవా బాగా కనిపిస్తోంది.

హై ఓల్టేజ్ స్టోరీతో రెడీగా
కొరటాల శివ డైరెక్షన్‌లో జూనియర్ ఎన్టీఆర్ తాజాగా నటించిన చిత్రమే 'దేవర'. ఈ ప్రతిష్టాత్మక సినిమా కోస్టల్ ఏరియా నేపథ్యంతో హై ఓల్టేజ్ యాక్షన్‌తో రాబోతుందని ఇప్పటికే చిత్ర రివీల్ చేసేసింది. అందుకు తగ్గట్లుగానే ఇప్పటికే వచ్చిన ప్రచార చిత్రాలు కూడా హైలైట్ అయ్యాయి. ఇందులో గతంలో ఎన్నడూ చూడని వైల్డ్ యాక్షన్‌ను చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

Jr NTR Starrer Devara Movie Run Time Reduced by 18 minutes

3 గంటల రన్ టైమ్‌తోనే

జూనియర్ ఎన్టీఆర్ డుయల్ రోల్‌లో నటించిన 'దేవర' సినిమాకు సంబంధించిన రన్ టైమ్ గురించి ఇటీవలే సమాచారం బయటకు వచ్చేసింది. దీన్ని దాదాపు మూడు గంటల నిడివితో తీసుకు రాబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ కూడా ఓ ఇంటర్వ్యూలో దీనిపై స్పష్టతను ఇచ్చాడు. ఫైనల్‌గా ఈ సినిమాను 2.58 నిమిషాలకు కట్ చేసినట్లు టాక్ వినిపించింది.

ట్రిమ్ చేసేసిన కొరటాల
'దేవర' సినిమా రన్ టైమ్ గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అయ్యాయి. అదే సమయంలో ఇంత పెద్ద మొత్తంలో ఉంటే ప్రేక్షకుల నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో తాజాగా ఈ సినిమా నుంచి 18 నిమిషాల రన్ టైమ్‌ను కట్ చేసినట్లు తెలిసింది. అంటే ఇప్పుడు ఇది 2.40 గంటల నిడివితోనే రాబోతుందట.

Jr NTR Starrer Devara Movie Run Time Reduced by 18 minutes

ఆ పాటతో పాటు వాటిని

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న 'దేవర' సినిమా నుంచి ఓ పాటతో పాటు కొన్ని సీన్స్ కట్ చేసినట్లు తాజాగా మరో న్యూస్ లీకైంది. దీని ప్రకారం.. ఇందులో సినిమాలో నుంచి 'దావూదీ' సాంగ్‌ను తీసేసి ఎండ్ కార్డ్‌లో వచ్చే టైటిల్స్ సమయంలో పెడుతున్నారట. అలాగే, ఎన్టీఆర్, జాన్వీ కపూర్ లవ్ సీన్స్‌తో పాటు కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేసినట్లు సమాచారం.

More from Filmibeat

Read more about: devara jr ntr koratala shiva
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X