Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గూస్‌బమ్స్ తెప్పించే న్యూస్.. దేవర ట్రైలర్ డేట్ ఫిక్స్

తెలుగు చిత్ర పరిశ్రమలో కొంత మంది మాత్రమే భీకరమైన ఫామ్‌తో దూసుకుపోతోన్నారు. అలాంటి వారిలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. దాదాపు పదేళ్లుగా వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతోన్న అతడు.. RRR సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గానూ ఎదిగిపోయాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా వెళ్తున్నాడు. ఇలా ఇప్పుడు 'దేవర' మూవీ చేస్తున్నాడు.

వరుస హిట్లతో సత్తా చాటుతోన్న జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీనే 'దేవర'. కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో హై రేంజ్ యాక్షన్‌తో రాబోతోంది. దీంతో దీనిపై అంచనాలు ఆకాశం అంత ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ మూవీని తీస్తున్నారు. అంతేకాదు, దీన్ని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారు.

Jr NTR Starrer Devara Movie Trailer Release On September 9th

'జనతా గ్యారేజ్' వంటి హిట్ తర్వాత ఎన్టీఆర్ - కొరటాల కాంబోలో రాబోతున్న 'దేవర' మూవీకి సంబంధించిన షూటింగ్ గత ఏడాదిలోనే ప్రారంభమైంది. అప్పటి నుంచి అస్సలు బ్రేకులు లేకుండా షూట్ చేస్తున్నారు. ఇలా ఇప్పటికే దీనికి సంబంధించి టాకీ పార్టును పూర్తి చేశారు. ఇప్పుడు ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను కూడా శరవేగంగా జరుపుతున్నారు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కలయికలో తెరకెక్కుతోన్న 'దేవర' మూవీ మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు. అందుకు తగ్గట్లుగానే ఈ మూవీ ప్రమోషన్‌ను కూడా ప్రారంభించేశారు. ఇలా ఇప్పటికే ఈ చిత్రం నుంచి మూడు పాటలను విడుదల చేశారు. ఇవన్నీ పాన్ ఇండియా రేంజ్‌లో సక్సెస్‌ను సొంతం చేసుకున్నాయి.

Jr NTR Starrer Devara Movie Trailer Release On September 9th

పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న 'దేవర' సినిమా విడుదలకు సమయం దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్‌ను మరింత వేగవంతం చేయబోతుంది. ఇందులో భాగంగానే ఈ చిత్రం నుంచి అఫీషియల్ ట్రైలర్‌ను సెప్టెంబర్ 9వ తేదీన విడుదల చేయబోతున్నారట. దీనికి సంబంధించిన ప్రకటన ఈ రెండు రోజుల్లోనే రాబోతుందని తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

ఇదిలా ఉండగా.. హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందుతోన్న 'దేవర' మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో జాన్వీ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇందులో శ్రీకాంత్, చాకో సహా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

More from Filmibeat

Read more about: devara jr ntr devara trailer
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X