»   » పోటీని తట్టుకునేందుకే జూ ఎన్టీఆర్‌ ఈ రూట్లో?

పోటీని తట్టుకునేందుకే జూ ఎన్టీఆర్‌ ఈ రూట్లో?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌‌ సినిమాల్లో నటిస్తాడనే విషయం అందరికీ తెలుసు. కానీ ఆయనకు సినిమాలు కొనుగోలు చేయాల్సిన అవసరం ఏముంటుంది?....కానీ ఆ అవసరం వచ్చింది, ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తన మామ నార్నె శ్రీనివాసరావు నడుపుతున్న స్టూడియో ఎన్ ఛానల్‌తో పాటు, కొత్తగా ప్రారంభమైన 'స్టూడియో వన్' అనే ఎంటర్టెన్మెంట్స్ ఛానల్ బాధ్యతలను భుజానెత్తుకున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.

మాటీవీ మాదిరిగా 'స్టూడియో వన్' ఛానల్ పూర్తి స్థాయి ఎంటర్టెన్మెంట్ ఛానల్‌గా ప్రేక్షకులను అలరించబోతోంది. ఈ ఛానల్ కోసం ఇప్పటికే దాదాపు 200 తెలుగు సినిమాల శాటిలైట్ రైట్స్ కొనుగోలు చేసారని తెలుస్తోంది. జూ ఎన్టీఆర్ ఈ ఛానల్ బాధ్యతలు భుజానెత్తుకోవడం వెనక మరో కారణం కూడా ఉందని తెలుస్తోంది.

మెగా స్టార్, అక్కినేని ఫ్యామిలీలకు మాటీవీలో వాటాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఛానల్స్ ద్వారా వీరు తమ పబ్లిసిటీ ఏదో ఒక రకంగా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తనకు ఓ ఛానల్ ఉంటే ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశ్యంతో జూ ఎన్టీఆర్ తన మామ నిర్వహిస్తున్న ఛానల్స్ బాధ్యతలు చేపట్టినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సరైన హిట్‌లేక పోటీలో కాస్త వెనకబడ్డ సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన నటించిన 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం కూడా బాక్సాఫీసు వద్ద నిరాశను మిగిల్చింది. ప్రస్తుతం ఎన్టీఆర్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లకొండ సురేష్ నిర్మిస్తున్న జోరు చిత్రంలో నటిస్తున్నారు.

English summary
Jr NTR wants to show his mark in establishing 'Studio One' channel as successful. No doubt ,Having a own channel will help to promote his own filmy image like Nagarjuna and Chiranjeevi have done with Maa TV.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu