డబ్బుకోసం తప్పుడు చిరునామా ఇచ్చిన జూ ఎన్టీఆర్..

By Kuladeep

ఒక్కో సినిమాకు సుమారు 6 నుండీ 7 కోట్ల వరకూ వసూలు చేసే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు డబ్బు కొదవా..?? అయినా డబ్బును మిగుల్చుకోవడానికి ప్రభుత్వాన్నే మోసం చేసేందుకు సిద్ధం అయ్యాడు ఈ ఘనుడు. గతంలో ఎన్టీఆర్ తన స్కోడా కారుకు 9999 అనే ఫ్యాన్సీ నెంబరు సంపాదించాడని వార్త వచ్చిన సంగతి తెలిసింది. కానీ ఈ ఫ్యాన్సీ నెంబరు కోసం ఆయన అడ్డదార్లు తొక్కారని ఓ ప్రముఖ దినపత్రిక ఓ వార్తని ప్రచురించింది.

ఆ కథనం ప్రకారం జూ ఎన్టీఆర్ ఫ్యాన్సీ నెంబరు కోసం తప్పుడు అడ్రస్సు ఇచ్చాడట. ఎందుకు దర్జాగా తనుంటున్న ఇంటి అడ్రస్సు ఇవ్వచ్చుగా అంటే ఇవ్వచ్చు కానీ హైదరాబాదులో ఫ్యాన్సీ నెంబరుకు డిమాండు ఎక్కవ కదా...దీంతో ఇక్కడ ఫ్యాన్సీ నెంబరు కావాలంటే సుమారు 5 నుండీ 6 లక్షల వరకూ ఖర్చు పెట్టాల్సివస్తుంది. దీంతో ఈయనగారు కన్ను అడ్డదార్ల మీద పడింది. అదిలాబాద్ వంటి పట్టణాల్లో ఈ ఫ్యాన్సీ నెంబరుకు తక్కువ డిమాండు వుండటంతో తను అదిలాబాదులోని రిక్షా కాలనీలో వుంటున్నట్టు తప్పుడు సమాచారం అందించి 50 వేలకే ఈ ఫ్యాన్సీ నెంబరు కొట్టేసాడు.

ఇక అధికారులు కూడా జూ ఎన్టఆర్ ఏంటి అదిబాదులో..అందులోనూ రిక్షా కాలనీలో వుండటం ఏంటి అని ఆలోచించకుండా ఏపీ01 జి 9999 నెంబరును సమర్పించేసుకున్నారు. ఇక ఇటీవలే కొన్న బిఎండబ్య్లూ కారుకు కూడా ఇదే తప్పుడు సమాచారం అందించి ఏపీ01 ఆర్ 9999 నెంబరును సంపాదించుకున్నాడు.

ఇంతవరకూ బాగానే నడిచిన ఈ భాగోతం ఆర్డీఏ అధికారులకు ఫిర్యాదు అందటంతో బట్టబయలయింది. దీంతో తొలుత నోటీసులు పంపినా పట్టించుకోని ఎన్టీఆర్ రిజిస్ట్రేషన్ రద్దు చేయడంతో చేసేది లేక దిగొచ్చి 5.10 లక్షలకు స్కోడా కారుకు ఫ్యాన్సీ నెంబరు పొందినా..బిఎండబ్ల్యూ కారు కోసం మరో 5 లక్షలు పెట్టడం ఇష్టంలేక తన మామయ్య చంద్రబాబు నాయుడి సాయంతో చక్రం తిప్పేందుకు సన్నాహాలు చేస్తున్నాడట. ఎన్నో కోట్ల రూపాయలు సంపాదిస్తూ..కోట్ల రూపాయలు విలువచేసే కార్లు కొంటూ మరీ నెంబర్ల కోసం ఇలా దిగజారడం ఎంతవరకూ సమంజసమో యంగ్ టైగర్ కే తెలియాలి..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X