»   » సుకుమార్ దర్శకత్వంలో జూ ఎన్టీఆర్!

సుకుమార్ దర్శకత్వంలో జూ ఎన్టీఆర్!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    హైదరాబాద్: టాలీవుడ్లో మరో క్రేజీ కాంబినేషన్ రాబోతోందా? నందమూరి అభిమానులకు శుభవార్త అందబోతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్లో త్వరలో ఓ సినిమా రూపొందబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సుకుమార్ జూ ఎన్టీఆర్ కోసం కథ రెడీ చేసాడని, జూ ఎన్టీఆర్ కూడా ఆయన దర్శకత్వంలో చేయడానికి దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.

    ఇప్పటి వరకు యూత్, అండ్ కాలేజీ స్టోరీలతో సినిమాలను రూపొందించిన సుకుమార్....ఎన్టీఆర్‌తో చేసే సినిమాతో సరికొత్త కాన్సెప్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని, తెలుగులో ఇప్పటి వరకు రానటువంటి పూర్తి భిన్నమైన కాన్సెప్టును రెడీ చేస్తున్నారని తెలుస్తోంది.

    ఇప్పటికే సుకుమార్ ఆర్య, ఆర్య-2, 100%లవ్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఈచిత్రం తర్వాత జూ ఎన్టీఆర్ తో చేసే సినిమాపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

    ప్రస్తుతం జూ ఎన్టీఆర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో 'బాద్ షా' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బేనర్ పై బండ్ల గణేష్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరో వైపు జూ ఎన్టీఆర్ హరీష్ శంకర్ తో మరో సినిమాకు కూడా కమిట్ అయ్యారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ పై దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

    English summary
    Young tiger Jr Ntr, who is busy with his current projects shootings, has signed a new film under the direction of Sukumar it seems. More details about this project, cast and crew will be out soon.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more