ఎన్టీఆర్ తప్పు తెలుసుకునే జాగ్రత్తలు
ఎన్టీఆర్ తాజా చిత్రం ఊసరవెల్లి భాక్సాఫీస్ వద్ద అప్పుడే వేడి చల్లారిపోయిన సంగతి తెలిసిందే. అయితే చాలా మంది హీరోలు చాలా టైమ్ దాకా ఇంకా తమ సినిమా హిట్ అని,కావాలని నెగిటివ్ ప్రచారం చేస్తున్నారనే భ్రమలో ఉంటూంటారు.అయితే ఎన్టీఆర్ మాత్రం మొదటి రోజు మార్నింగ్ షోకే పరిస్దితి అర్దం చేసుకున్నాడని సమాచారం. అందుకు తగినట్లుగా వెంటనే యాక్షన్ ప్లాన్ సమకూర్చుకుని మీడియాకి ఇంటర్వూలు ఇచ్చి కలెక్షన్స్ డ్రాప్ అవ్వకుండా చూసాడు. అంతేగాక తన అభిమానులు ఈ సినిమాతో నీరసపడతారని గమనించిన ఎన్టీఆర్ ..దమ్ము చిత్రంలో వారికి నచ్చే మసాలాలు ఉంటాయని, విందు భోజనం లా ఉంటుందని హామీ ఇచ్చాడు. అంతేగాక తనకు వచ్చిన ఒళ్లుని తగ్గించుకుని తర్వాత చిత్రంలో నిజంగానే కరెంట్ తీగలాగ కనపడతానని హామీ ఇచ్చాడు.అదే ఇంకో హీరో అయితే రియలైజ్ అవ్వటానికి చాలా టైమ్ పట్టేదని ఎన్టీఆర్ వాస్తవానకి చాలా దగ్గరగా ప్రాక్టికల్ గా ఉండే మనిషిని అందరూ మెచ్చుకుంటున్నారు.
ఇక ఊసరవెల్లి గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ...తన అభిమానలు నిరాసపడకుండా అది ఓ ప్రయోగ చిత్రం అని చెప్పుకొచ్చారు. ఆయన మాటల్లోనే...హీరోయిన్ మీద రన్ అయ్యే సినిమా అనేసరికి అందరికీ రిస్క్ అనే భావన వస్తుంది. కానీ నేను తొలిసారి వినగానే కథ బాగా నచ్చింది. అస్సలు హీరోయిన్ మీద నడవకపోతే కథలో కొత్తదనమేముంటుంది. లేడీస్ అందరూ ఈ కథకు అంత బాగా కనెక్టు అవుతున్నారంటే కారణం కథే.కాకపోతే టైటిల్ పరంగా కొంత ఆలోచించా అన్నారు. ఇక ఈ చిత్రం నా జీవితంలో ఇదో ప్రత్యేక చిత్రంగా మిగిలిపోతుంది. కథా పరంగా ఓ ప్రయోగం గా అనిపించింది. ఇంటర్వెల్ అయిన తర్వాత తమన్నా ప్లాష్ బ్యాక్ మొదలవుతుంది. దాదాపు ఇరవై నిముషాల సేపు హీరో కనపడడు. వాణిజ్య అంశాలు మేళవించిన చిత్రాల్లో ఇలాంటి ఎత్తుగడ ఓ ప్రయోగం ..ప్రమాదం అన్నారు. కానీ సురేంద్రరెడ్డి ఈ పాయింటు చెప్తున్నప్పుడు బాగా నచ్చి చేసాను అంటున్నారు.ప్రేక్షకులు గుర్తించే ముందే తాను క్లారిటీ ఇచ్చేస్తే మంచిదనే ఇలా ఎన్టీఆర్ అంటున్నాడని అంటున్నారు.ఈ వరస చూస్తుంటే ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం దమ్ము గ్యారెంటీగా దుమ్ము రేపే అవకాసం ఉందని పిస్తోంది.


Click it and Unblock the Notifications











