హీరో దగ్గుబాటి రాణా, సురేష్ బాబులకు క్లాస్ పీకిన జూ ఎన్టీఆర్..!
తన పబ్లిసిటి చేసిన పిచ్చి పనికి దగ్గుబాటి రాణాతో పాటు అతని తండ్రి సురేష్ బాబు కూడా తిట్లు తింటున్నారు. 'శక్తి" సినిమా గురించి ఇన్ ఫర్మేషన్ అందించే నెపంతో ఆ చిత్రంలోని సన్నివేశాలని సీన్ టు సీన్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు సదరు పబ్లిసిస్ట్, రామానాయుడు స్టూడియోస్ ఎంప్లాయీ. ఇది చాలా ఫాస్టుగా జూ ఎన్టీఆర్ కి, అశ్వినీదత్ కీ చేరిపోవడంతో వాళ్లు పర్సనల్ గా కాల్ చేసి రాణా, సురేష్ బాబుకి క్లాస్ పీకారు. వాళ్లెలా గడ్డి పెట్టారో కానీ సదరు పబ్లిసిస్ట్ ట్విట్టర్ అకౌంట్ నే డెలీట్ చేసుకున్నాడు. ఒక హీరోకి పబ్లిసిస్ట్ గా వ్యవహరించే వాళ్లు మరియు ఇతర హీరోల విషయంలో హుందాగా ఉండాలనే కనీస మర్యాద మర్చిపోతున్నారు. ఇలాంటి బాధ్యతా రాహిత్యం గల వాళ్లని పబ్లిసిస్ట్ లుగా పెట్టుకున్నందుకు హీరోలు తిట్లు తింటున్నారు.


Click it and Unblock the Notifications











