జూ ఎన్టీఆర్ సరసన తమన్నా మరోసారి?

By Bojja Kumar

హైదరాబాద్ : గతంలో జూ ఎన్టీఆర్ నటించిన ఊరసవెల్లి చిత్రం బాక్సాఫీసు వద్ద ఆశించిన ఫలితాలు రాబట్టలేక పోయినా....ఈ చిత్రంలో జంటగా నటించిన జూ ఎన్టీఆర్, తమన్నా మధ్య కెమిస్ట్రీ మాత్రం బాగా వర్కౌట్ అయింది. ఇద్దరి మధ్య రొమాంటిక్, కామెడీ సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

తాజాగా ఫిల్మ్ నగర్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం జూ ఎన్టీఆర్, తమన్నా మళ్లీ కలిసి నటించబోతున్నారని తెలుస్తోంది. '1 నేనొక్కడినే' చిత్ర దర్శకుడు సుకుమార్ తన నెక్ట్స్ ప్రాజెక్టు జూ ఎన్టీఆర్‌తో చేయబోతున్నాడని, ఈ చిత్రంలో హీరోయిన్‌గా తమన్నాను తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ సమాచారం వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బివిఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం జూ ఎన్టీఆర్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈచిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు.

ఇక హీరోయిన్ తమన్నా ప్రస్తుతం నాలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. 'ఇట్స్ ఎంటర్టెన్మెంట్', 'హమ్ షకల్స్' అనే హిందీ చిత్రాలతో పాటు తెలుగులో మహేష్ బాబు సరసన 'ఆగడు' చిత్రంలో, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'బాహుబలి' చిత్రంలో నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X