జూ ఎన్టీఆర్ ‘శక్తి’ చిరు ‘జగదేకవీరుడు అతిలోకసుందరి' ని బ్రేక్ చేస్తుందా!
బాలీవుడ్ లో హృతిక్ రోషన్ చేసిన 'క్రిష్" సినిమాని ఎన్నిసార్లు చూశాడో ఎంతగా నచ్చేసిందో కానీ మన జూనియర్ ఎన్టీఆర్ ఎలాగైనా అలాంటిదొకటి చేసెయ్యాలని బాగా ఉత్సాహపడుతున్నాడు. మొన్నటికి మొన్న 'క్రిష్" లోని ఫాదర్ ట్రాక్ ని యదాతదంగా 'అదుర్స్" లో వాడేసుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు 'క్రిష్" క్యారెక్టరైజేషన్ ని తన 'శక్తి" మేరకు ఓన్ చేసుకునే పనిలో పడ్డాడని అంటున్నారు పరిశీలకులు.
జూ ఎన్టీఆర్ 'కంత్రి" విజయం తర్వాత అదుర్స్ చిత్రం మంచి కలెక్షల్లే సాధిచింది. తర్వాత రాబోతున్న చిత్రం ప్రస్తుతం నిర్మానంలో ఉన్న శక్తి పై పెద్ద అంచనాలను పెట్టుకొన్నాడని తెలుస్తోంది. అందలో బాగంగానే 'జగదేక వీరుడు అతిలోక సుందరి" చిత్రానికి పనిచేసిన ఐదు మంది చేత స్క్రిఫ్ట్ ని తయారు చేయించారని వినికిడి.
ఎన్టీఆర్, ఇలియానా జంటగా మెహర్ రమేష్ దర్శకత్వంలో మైజయంతీ మూవీస్ బేనర్ పై అశ్వనీదత్ నిర్మిస్తోన్న 'శక్తి" చిత్రంలోని హీరో పాత్ర 'క్రిష్" లోహృతిక్ రోషన్ లా కొన్ని సూపర్ నేచురల్ పవర్స్ కలిగి వున్నాయని సమాచారం. అందుకేనేమో 'శక్తి" ఓపెనింగ్ రోజునే ఇందులో ఫాంటసీ మిక్స్ అయి వుంటుందని అధికారికంగానే ప్రకటించేశారు. ఈ సినిమా తమ బేనర్ లో మరో 'జగదేకవీరుడు అతిలోకసుందరి" అవుతుందని అశ్వనీదత్ అంటున్నారట.


Click it and Unblock the Notifications











