'స్వామిరారా' దర్శకుడితో జూ ఎన్టీఆర్?
తాజాగా సుధీర్ వర్మకు భారీ ఛాన్స్ దక్కబోతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. సుధీర్ వర్మ ఇటీవల జూనియర్ ఎన్టీఆర్‌కు కథ చెప్పాడని, సుధీర్ కథ కాన్సెప్టు నచ్చిన ఎన్టీఆర్ పాజిటివ్‌గా స్పందించారని, కథలో కొన్ని మార్పులు చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. సుధీర్ వర్మకు ఈ ప్రాజెక్టు ఓకే జాక్ పాట్ కొట్టినట్లే అని ఆయన సన్నిహితులు అంటున్నారు.
ఈ చిత్రం ఓకే అయితే.......నిర్మించడానికి ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ తనయుడు బాపినీడు రెడీ గా ఉన్నారని సమాచారం. సుధీర్ వర్మ, బాపినీడు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ కోసమే ఎదురు చూస్తున్నారని తెలుస్తోంది. మరి సుధీర్ వర్మ అదృష్టం ఎలా ఉందో చూడాలి.
ప్రస్తుతం జూ ఎన్టీఆర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. శృతి హాసన్ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ పై నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications












