అల్లు అర్జున్ 'బద్రినాథ్' తో జూ ఎన్టీఆర్ కెందుకంత టెన్షన్...!?
పోకిరి" వచ్చి అయిదేళ్లు గడిచిపోయినా ఇంతదాకా ఆ సినిమా రికార్డుని కూడా కొట్టేలకపోయాడు జూ ఎన్టీఆర్. మగధీర రికార్డు మాట అటుంచి ముందు ఇది కొట్టి చూపించండంటూ అటు మెగా ఫ్యాన్స్, ఇటు మహేష్ ఫ్యాన్స్ నందమూరి అభిమానుల్ని సవాళ్ళు విసురుతున్నారు. ఈ ఐదేళ్ల కాలంటో యమదొంగ, అదుర్స్, బందావనం వంటి హిట్ చిత్రాలు చేసినా కానీ పోకిరి దరిదాపుల్లోకి కూడా వాటి వసూళ్లు చేరలేకపోయాయి. పెద్ద స్టార్ అయిన జూ ఎన్టీఆర్ కి ఇది నిజంగా తలవంపులు తెచ్చే విషయమే.'శకర్తి" తో ఒకేసారి కూష్మాండం బద్దలుకొట్టాలని చూసిన జూనియర్ తన బ్రహ్మాండమే బద్దలైపోయింది.
అయితే త్వరలో విడుదల కాబోతున్న అల్లు అర్జున్ సినిమా బద్రీనాథ్ గురించి ఎన్టీఆర్ టెన్షన్ పడుతున్నాడు. మగధీరని కొట్టలేకపోయినా కనీసం పోకిరి రికార్డుని కొట్టే సత్తా ఉన్న సినిమా అంటూ బద్రీనాథ్ గురించి చెప్పుకుంటూ ఉంటే, అదే జరిగితే తన పరువేం కవాలని జూ ఎన్టీఆర్ టెన్షన్ పడిపోతున్నాడు. మహేష్ రికార్డు కొట్టడం తనకి చేతకాకపోయినా బన్నీ కొట్టి చూపించడాడని అంటారని, ఇక ఇండస్ట్రీ టాప్ 2హిట్స్ తమవే అయితే మెగా ఫాన్స్ ని పట్టుకోలేమని ఎన్టీఆర్ వర్గం బద్రీనాథ్ రిజల్ట్ గురించి ఇప్పట్నుంచే బెంగ పెట్టుకున్నారు.


Click it and Unblock the Notifications











