‘దూకుడు’ స్టామినాకు భయపడుతున్న జూ ఎన్టీఆర్...!?
ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో సరైన తెలుగు సినిమాలు లేక డబ్బింగ్ సినిమాలను ఆదరిస్తూ మంచి తెలుగు సినిమా కోసం ఎదురుచూసిన మన తెలుగు ఆడియన్స్ ఒక్కసారిగా 'దూకుడు" థియేటర్స్ మీద దూకుడుగా పడ్డారు, కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ దసరా సీజన్ లో 'దూకుడు"తర్వాత రాబోతున్న సినిమా'ఊసరవెల్లి" భారీ అంచనాల మధ్య ఈ సినిమా అక్టోబర్ 6న దసరా కానుకగా రిలీజ్ కాబోతుంది. ప్రస్తుత ట్రెండ్ ని చూస్తుంటే 'ఊసరవెల్లి"కూడా పెద్ద హిట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయని ట్రేడ్ ఎక్స్ పెక్ట్ చేస్తోంది. దానికి తగ్గట్టుగానే ల్యాబ్ రిపోర్ట్ కూడా సినిమా బాగుందని రావడంతో 'ఊసరవెల్లి" కన్ ఫర్మ్ హిట్ అని ఎన్టీఆర్ అభిమానులు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
కాగా ఇప్పటిదాకా నెంబర్ వన్ స్థానం ఈ హీరోది అనే చర్చలు సాగినప్పుడల్లా...కొంతమంది ఎన్టీఆర్ అని, మరికొంతమొది మహేష్ బాబు అని, మరికొంతమంది రామ్ చరణ్, అల్లు అర్జున్ అని చెప్పుకొంటూ వచ్చారు. ఎన్టీఆర్ కాంపౌండ్ మాత్రం ఎన్టీఆర్ దే నెంబర్ వన్ స్థానం అని ఫిక్స్ అయిపోయారు. కానీ 'దూకుడు" రిపోర్ట్స్, ఓపెనింగ్స్ చూసిన పరిశ్రమ వర్గాలు మహేష్ బాబు స్టామినా గురించి చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఇక మహేష్ రేంజ్ ఏమంటో తెలుసుకున్న జూ ఎన్టీఆర్, నెంబర్ వన్ స్థానం కైవసం చేసుకోవడం అంత ఈజీకాదని అనుకుంటున్నాడట. పర్సనల్ గా 'దూకుడు" రిపోర్ట్స్ ను తెప్పించుకుని చూస్తున్నాడట జూ ఎన్టీఆర్...
ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న 'ఊసరవెల్లి" డిటిఎస్ మిక్సింగ్ జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి విజయదశమి కానుకగా అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఆడియో ఇప్పటికే హిట్ అయ్యి ప్రేక్షకాదరణ పొందుతున్నాయి.


Click it and Unblock the Notifications











