జూ ఎన్టీఆర్ టైటిల్ తో అల్లరి నరేష్ సినిమా!?
జూ ఎన్టీఆర్ తో ఆ మధ్య షాక్ దర్శకుడు హరీష్ శంకర్ ఎం.ఎల్.ఏ చిత్రాన్ని రూపొందిస్తాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఎం అంటే మంచి ఎల్ అంటే లక్షణాలు ఏ అంటే అబ్బాయి అని అప్పట్లో ఈ పదానికి స్వంత ఎబ్రివేషన్ ఇచ్చి మరీ ఆకట్టుకున్నాడు. నల్లమలుపు బుజ్జి నిర్మిస్తానన్న ఆ చిత్రం ఏమయిపోయిందో ..అసలు మెటీరియలైజ్ అవుతుందో లేదో తెలియలేదు. కానీ ఇప్పుడా టైటిల్ ని అల్లరి నరేష్ చిత్రానికి వాడుతున్నట్లు సమాచారం. ముళ్ళపూడి వీరభద్ర చౌదరి అనే నూతన దర్సకుడు డైరక్షన్ లో ఎ ఛానెల్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఎ ఛానెల్ వారు లేటెస్ట్ గా నిర్మించిన నమో వెంకటేశ చిత్రం సంక్రాంతికి రిలీజై డివైడ్ టాక్ తెచ్చుకుంది. అలాగే ఈ ఎ ఛానెల్ వారే మనోజ్ హీరోగా రచయిత వీరూపోట్లను దర్శకుడుగా పరిచయం చేస్తూ బిందాస్ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఎం ఎల్ ఏ చిత్రం వారికి మూడో చిత్రం. ఈ చిత్రంలో శ్రీహరి కీలకమైన పాత్రను చేస్తున్నట్లు సమాచారం. గోపీమోహన్ కథా సహకారం చేస్తున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











