RRR నుంచి షాకింగ్ సర్‌ప్రైజ్: ఊహించని పాత్రలో ఎన్టీఆర్.. రాజమౌళి ప్లాన్ అదేనట!
బడా ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ప్రవేశించినా.. తనలోని టాలెంట్లన్నింటినీ నిరూపించుకుని చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. చిన్న వయసులోనే ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకున్న అతడు.. మధ్యలో ఘోర పరాజయాలతో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఇక, ఈ మధ్య ఫుల్ ఫామ్‌లోకి వచ్చేశాడు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం చేస్తున్న RRR మూవీ కోసం ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడట తారక్. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాలో అతడు ఊహించని పాత్రలో కనిపించబోతున్నాడని తాజాగా ఓ న్యూస్ లీకైంది. ఆ వివరాలు మీకోసం!

వరుస విజయాలతో హవా చూపిస్తున్నాడు
జూనియర్ ఎన్టీఆర్ కొన్నేళ్లుగా వరస విజయాలతో దూసుకుపోతున్నాడు. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘టెంపర్' నుంచి మొదలుకొని.. ‘నాన్నకు ప్రేమతో', ‘జనతా గ్యారేజ్', ‘జై లవ కుశ', ‘అరవింద సమేత.. వీరరాఘవ' వంటి హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో టాప్ పొజిషన్‌కు చేరువ కావడంతో పాటు తన మార్కెట్‌ను గణనీయంగా పెంచుకున్నాడు.

భారీ ప్రాజెక్టు కోసం రామ్ చరణ్‌తో కలిశాడు
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ నటిస్తోన్న చిత్రం RRR (రౌద్రం రణం రుధిరం). దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. పోరాట యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం సమకూర్చుతున్నాడు.

RRR కోసం సాహసాలు... నిత్యం అదే పని
తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అత్యంత భారీ బడ్జెట్, హైటెక్నికల్ వ్యాల్యూస్‌తో తెరకెక్కుతోన్న RRR కోసం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఎంతగానో శ్రమిస్తున్నాడు. అతడు పోషిస్తోన్న కొమరం భీం పాత్రకు న్యాయం చేసేందుకు ఎన్నో సాహసాలకు సిద్ధం అవుతున్నాడు. అలాగే, సరైన ఫిజిక్‌ను మెయింటైన్ చేయడం కోసం రోజులో ఎక్కువ భాగం జిమ్‌లో కసరత్తులు చేస్తున్నాడు.
Recommended Video

రియల్ స్టంట్స్.. తారక్ సంచలన నిర్ణయాలు
ఇక, ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర చాలా హైలైట్‌గా ఉంటుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. మరీ ముఖ్యంగా ఈ చిత్రంలో తన పరిచయ సీన్ కోసం అతడు నిజమైన పులి ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లాడని ఆ మధ్య ఓ న్యూస్ లీకైంది. అలాగే, ఈ సినిమా కోసం గుండుతో కనిపించబోతున్నాడని కూడా వార్తలు వచ్చాయి. మొత్తంగా RRR కోసం తారక్ ఎన్నో సాహసాలు చేయబోతున్నాడట.

ఎన్టీఆర్ పాత్రకే ప్రాధాన్యం.. షాకింగ్ సర్‌ప్రైజ్
ఈ భారీ మల్టీస్టారర్ మూవీలో రామ్ చరణ్ పాత్ర కంటే జూనియర్ ఎన్టీఆర్ రోల్‌కే ఎక్కువ ఎలివేషన్ ఉంటుందని ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తోంది. దీనికి కారణం కొమరం భీం నిజ జీవితంలో చేసిన సాహసాలే అని అంటున్నారు. ఇక, ఈ సినిమాలో తారక్ ఆరు గెటప్‌లలో కనిపిస్తాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దీని గురించి తాజాగా ఓ షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది.

ఊహించని పాత్రలో ఎన్టీఆర్.. రాజమౌళి ప్లాన్
తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ వృద్ధుడిలా కనిపించబోతున్నాడట. అతడు వేసే ఆరు పాత్రల్లో ఇది ఒకటి అని అంటున్నారు. అల్లూరి పాత్ర ఇప్పటికే చాలా సినిమాల్లో కనిపించగా.. కొమరం భీం గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. అందుకే ఎన్టీఆర్ పోషిస్తున్న పాత్రకు ప్రాధాన్యం ఇచ్చి ఆ పోరాట యోధుడిని బాగా హైలైట్ చేయాలని రాజమౌళి ప్లాన్ చేశాడని టాక్.


Click it and Unblock the Notifications











