ఎన్టీఆర్ సెన్సేషనల్ డెసిషన్.. అక్కడ కూడా స్టామినా చూపించడానికి ప్లాన్ రెడీ
వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఒకానొక సమయంలో ఎన్నో ఫ్లాపులు పలకరించినా ఏమాత్రం వెనకడుగు వేయకుండా ముందుకు నడిచాడు. ఈ క్రమంలోనే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'టెంపర్' నుంచి అతడు సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఈ సినిమాతో మొదలు పెట్టి వరుసగా 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్', 'జై లవ కుశ', 'అరవింద సమేత'తో సక్సెస్‌ఫుల్ హీరోగా కొనసాగుతున్నాడు.

మార్కెట్ పెరిగిపోయింది
వరుస విజయాలతో దూసుకుపోతున్న తారక్.. టాప్ పొజిషన్‌పై కన్నేశాడు. ఈ క్రమంలోనే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అదే సమయంలో తన మార్కెట్‌ను కూడా భారీ స్థాయిలో పెంచుకున్నాడు. అదే సమయంలో వ్యాపార ప్రకటనలు కూడా చేస్తూ బిజీ అయిపోయాడు. కొన్ని చానెళ్లకు బ్రాండ్ అంబాసీడర్‌గానూ వ్యవహరిస్తున్నాడు.

‘RRR’ కోసం ప్రత్యేకంగా...
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘RRR'లో నటిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. ఇందులో తారక్.. కొమరం భీం పాత్రలో కనిపించనున్నాడు. ఇందుకోసం ఆయన ప్రత్యేక కసరత్తులు చేస్తున్నాడు. ఎక్కువ సమయం జిమ్‌లోనే గడుపుతున్నాడు.

ఎన్టీఆర్ సెన్సేషనల్ డెసిషన్
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘RRR' తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని భాషల్లోనూ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నాడట. వాస్తవానికి తారక్‌కు తమిళ, హిందీ భాషలపై మంచి పట్టు ఉంది. అతడు కన్నడంలోనూ గతంలో ఓ పాటను కూడా పాడడు.

స్టామినా చూపించడానికి ప్లాన్ రెడీ
తెలుగులో ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. మిగిలిన భాషల్లోనూ తన స్టామినాను తెలియజేసేందుకే తారక్ ఈ నిర్ణయం తీసుకున్నాడని టాక్. ఈ విషయాన్ని రాజమౌళికి చెప్పడం ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగిపోయాయని ఫిలింనగర్ ఏరియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

ఆ విషయంలో క్లారిటీ లేదు
ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ విషయంలో ఇప్పటికీ క్లారిటీ రాలేదు. సినిమా షూటింగ్ ఆరంభంలో ఓ హాలీవుడ్ నటిని తీసుకున్నారని చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే, ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది. తర్వాత ఎమ్మా రాబర్ట్స్ అనే నటిని అనుకున్నారు. కానీ, అది ఫైనలైజ్ కాలేదు. ఇక, రెండు రోజుల నుంచి మరో బ్రిటన్ నటి పేరు వినిపిస్తోంది. ఇంతకీ అతడి సరసన ఎవరు నటిస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











