మరీ అంతలానా?: ఎన్టీఆర్ ఫిజిక్‌పై చర్చ.., త్రివిక్రమ్ ఏం చేయబోతున్నాడు?

Recommended Video

మళ్ళీ బరువు తగ్గనున్న ఎన్టీఆర్ !

'కరెంట్ తీగ కూడా నాలానే సన్నగా ఉంటుంది.. కానీ పట్టుకుంటే దానమ్మ షాకే..' అంటూ ఊసరవెల్లిలో జూ.ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ చాలా పాపులర్. ఇప్పుడు మళ్లీ ఆ కరెంట్ తీగ తరహాలో సన్నగా మారడానికి సిద్దమైపోతున్నారట ఎన్టీఆర్.

ఊసరవెల్లి సినిమాలో పాత్రకు తగ్గట్లు సన్నగా కనిపించిన ఎన్టీఆర్.. ఆ తర్వాతి సినిమాల్లోను పాత్రల అవసరం మేరకు వెయిట్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. తాజాగా త్రివిక్రమ్‌తో సినిమా మొదలుకావడంతో.. బరువుపై మరోసారి ఆయన ఆలోచనలో పడ్డారట.

బరువు తగ్గడంపై ప్రచారం

బరువు తగ్గడంపై ప్రచారం

త్రివిక్రమ్‌తో చేస్తున్న సినిమా కోసం.. క్యారెక్టర్ డిమాండ్ మేరకు ఎన్టీఆర్ భారీగా బరువుగా తగ్గాలని నిర్ణయించుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్ని కిలోలు తగ్గబోతున్నారనే దానిపై క్లారిటీ లేనప్పటికీ.. ఏకంగా 18కిలోలు తగ్గబోతున్నారంటూ ప్రచారం జరుగుతుండటం గమనార్హం.

 యమదొంగ టైమ్‌లో:

యమదొంగ టైమ్‌లో:

ఎన్టీఆర్ ఫిజిక్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే.. 'యమదొంగకు ముందు.. ఆ తర్వాత' అనే మాట్లాడుకోవాలి. అప్పటిదాకా బొద్దుగా కనిపించిన ఆయన.. అప్పటినుంచి నిజంగానే కరెంట్ తీగలా సన్నగా మారిపోయారు. అభిమానులు కూడా ఎన్టీఆర్‌ను ఒక్కసారిగా అలాంటి కటౌట్‌లో చూడటానికి మొదట్లో కాస్త ఇబ్బంది పడ్డా.. ఆ తర్వాత కనెక్ట్ అయిపోయారు.

 మరీ అంతలానా?:

మరీ అంతలానా?:

ప్రస్తుతం ఎన్టీఆర్ వెయిట్ అంత భారీగా ఏమి లేదు. అలాంటిది ఏకంగా 18కిలోలు తగ్గిపోతే.. ఫిజిక్‌లో దారుణమైన మార్పులు రావడం ఖాయం. కాబట్టి బయట ప్రచారంలో ఉన్నట్లు ఎన్టీఆర్ అంత భారీగా బరువు తగ్గడం జరగకపోవచ్చు.

 త్రివిక్రమ్ ఎలా చూపిస్తారో!:

త్రివిక్రమ్ ఎలా చూపిస్తారో!:

టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన పవన్, మహేష్, ఎన్టీఆర్ లలో ఒక్క ఎన్టీఆర్‌తో మాత్రమే తివిక్రమ్ సినిమా బాకీ పడిపోయాడు. 'అతడు'లో మహేష్ క్యారెక్టర్‌ను తివిక్రమ్ తీర్చిదిద్దిన తీరును ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు.

అలాగే జల్సాలో పవన్ కల్యాణ్ పాత్ర కూడా అభిమానులను ఉర్రూతలూగించింది. ఆ ఇద్దరు స్టార్స్‌ను ఓ రేంజ్‌లో చూపించిన త్రివిక్రమ్ ఇప్పుడు ఎన్టీఆర్ పాత్రను ఎలా డిజైన్ చేయబోతున్నారన్నది అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అందులో భాగంగానే.. ఎన్టీఆర్‌కు బరువు తగ్గమని సలహా ఇచ్చారంటే.. దాని వెనుక మతలబేంటో?..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X