For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్: సైన్స్ ఫిక్షన్ కాదు.. ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్ ఇది

  |

  కొంత కాలంగా జూనియర్ ఎన్టీఆర్ ఫుల్ ఫామ్‌తో కనిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు వరుసగా సినిమాలను లైన్‌లో పెడుతూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే పలు చిత్రాలను ప్రకటించిన ఈ నందమూరి హీరో.. మరికొన్నింటి విషయంలో చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక, తారక్ ఇప్పుడు ప్రకటించిన వాటిలో ప్రశాంత్ నీల్ మూవీ కూడా ఉంది. ఈ సినిమా గురించి ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ఎన్టీఆర్ పోషించే పాత్ర గురించి ఓ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  రియల్ హీరోగా నటిస్తోన్న స్టార్ హీరో

  రియల్ హీరోగా నటిస్తోన్న స్టార్ హీరో

  కొంత కాలంగా వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఈ క్రమంలోనే ప్రస్తుతం రాజమౌళి రూపొందిస్తోన్న RRR (రౌద్రం రణం రుధిరం) అనే సినిమాలో రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ మూవీని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో తారక్.. కొమరం భీంగా, చరణ్.. అల్లూరి పాత్రలను చేస్తున్నారు.

  30వ మూవీ విషయంలో ట్విస్ట్ ఇస్తూ

  30వ మూవీ విషయంలో ట్విస్ట్ ఇస్తూ

  RRR మూవీ షూటింగ్ జరుగుతోన్న సమయంలోనే తన 30వ సినిమాను త్రివిక్రమ్‌తో చేస్తున్నట్లు ప్రకటించాడు తారక్. అయితే, ఇది ప్రకటనకే పరిమితం అయిపోయింది. ఎన్నో మలుపుల నడుమ ఈ సినిమాను ఆపేసినట్లు వెల్లడించారు. అనంతరం 30వ ప్రాజెక్టును కొరటాల శివతో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే వచ్చేసింది.

  31వ సినిమా అతడితో అని ప్రకటన

  31వ సినిమా అతడితో అని ప్రకటన

  ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో జూనియర్ ఎన్టీఆర్ ఫుల్‌ స్పీడుతో దూసుకెళ్తున్నాడు. కొరటాల శివతో సినిమాను అనౌన్స్ చేసిన అతడు.. ఆ వెంటనే 31వ చిత్రాన్ని కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో చేస్తున్నట్లు ప్రకటించాడు. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో పట్టాలెక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ, అది సాధ్యం కాలేదు. అయితే, ఎట్టకేలకు ఇటీవలే ప్రకటన వెలువడింది.

  వీళ్లిద్దరి ప్రాజెక్టుపై భారీగా అంచనాలు

  వీళ్లిద్దరి ప్రాజెక్టుపై భారీగా అంచనాలు

  జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ సినిమా చేస్తున్నాడని ఎంతో కాలంగా ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మాతలు కూడా దీనిపై క్లారిటీ ఇచ్చారు. అదే సమయంలో ప్రశాంత్ నీల్ కూడా గత ఏడాది ఎన్టీఆర్ పుట్టినరోజున దీనిపై పరోక్షంగా ట్వీట్ చేశాడు. దీంతో వీళ్ల కాంబో కోసం ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు. దీంతో దీనిపై అంచనాలు ఏర్పడ్డాయి.

  అలాంటి సినిమా.. ‘మిస్సైల్' అంటూ

  అలాంటి సినిమా.. ‘మిస్సైల్' అంటూ

  ప్రశాంత్ నీల్ - జూనియర్ ఎన్టీఆర్ కలయికలో రాబోయే సినిమా సైన్స్ ఫిక్షన్ కథతో తెరకెక్కబోతుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం ఈ దర్శకుడు ‘రేడియేషన్ షూట్'ను రెడీ చేస్తున్నా అని గతంలో ట్వీట్ చేయడమే. అంతేకాదు, ఈ సినిమాకు ‘మిస్సైల్' అనే టైటిల్‌ను కూడా రిజిస్టర్ చేసినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. ‘సలార్' వల్ల ఈ మూవీ మరుగున పడింది.

  ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్

  ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్

  ప్రశాంత్ నీల్ తెరకెక్కించే సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సైంటిస్టుగానో.. మాఫియా డాన్‌గానో నటిస్తున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అందుకు అనుగుణంగానే ఈ మూవీ స్టోరీ లైన్ అంటూ ఒకటి తెరపైకి వచ్చింది. దీంతో ఇదే ఫిక్స్ అని అంతా అనుకున్నారు. అయితే, దీనిపై మాత్రం ఎటువంటి క్లారిటీ రాలేదు. తాజా సమాచారం ప్రకారం.. ఇందులో ఎన్టీఆర్ పొలిటీషియన్‌గా చేస్తున్నాడట.

  RRR Movie Streaming Details, బిజినెస్ 1200 కోట్ల పైనే || Filmibeat Telugu
  సైన్స్ ఫిక్షన్‌తో కాదు.. భారీ సర్‌ప్రైజ్

  సైన్స్ ఫిక్షన్‌తో కాదు.. భారీ సర్‌ప్రైజ్

  జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి కొంత కాలంగా ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రశాంత్ నీల్ తెరకెక్కించే చిత్రంలో అతడు రాజకీయ నాయకుడిగానే నటించబోతున్నాడట. గతంలో ఎప్పుడూ కనిపించని తరహా పాత్రను ప్రశాంత్ డిజైన్ చేసినట్లు తెలిసింది. ఈ చిత్రంలో తారక్ సరికొత్త ఎలివేషన్‌తో విభిన్నమైన పొలిటీషియన్‌గా కనిపిస్తాడని టాక్.

  English summary
  Tollywood Young Hero Jr NTR Busy with RRR Shooting. after this he will work with Prashanth Neel. in This Movie Jr NTR to play Politician Role.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X