Devara: దేవరలో ఎన్టీఆర్‌లు ఇద్దరు కాదు.. ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్‌లో అతడి ఎంట్రీతో ట్విస్ట్
ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు కాదు.. ఏకంగా ఆరు వరుస విజయాలను సొంతం చేసుకుని కెరీర్‌లోనే బీభత్సమైన ఫామ్‌తో దూసుకుపోతోన్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఈ హిట్లతో తన ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను కూడా భారీగా పెంచుకున్న అతడు.. RRR అంతర్జాతీయ గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ఈ జోష్‌లోనే ఇప్పుడు 'దేవర' మూవీని చేస్తున్నాడు.
టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న 'దేవర' సినిమా కోస్టల్ ఏరియా నేపథ్యంతో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. దీంతో దీనిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని రూపొందిస్తున్నారు. దీనికితోడు ఇటీవలే వచ్చిన గ్లింప్స్‌తో 'దేవర' చిత్రంపై హైప్ భారీగా పెరిగిపోయింది.

హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందుతోన్న 'దేవర' మూవీని రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. అందులో మొదటి భాగాన్ని ఈ ఏడాదిలోనే ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ, అనివార్య కారణాలతో దీన్ని అక్టోబర్ 10వ తేదీకి వాయిదా వేశారు. అప్పటి వరకూ సినిమా షూటింగ్‌తో పాటు మిగిలిన కార్యక్రమాలను పూర్తి చేయాలని ప్లాన్లు చేసుకుంటున్నారు.
సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో రాబోతున్న 'దేవర' మూవీకి సంబంధించిన షూటింగ్‌ను శరవేగంగా జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇందులో ఎన్టీఆర్ పాత్రల గురించి ఓ ఆసక్తికరమైన న్యూస్ బయటకు వచ్చింది. 'దేవర' మూవీ ఫస్ట్ పోస్టర్‌తో పాటు ఇటీవల వచ్చిన దానిలో ఎన్టీఆర్ డిఫరెంట్ గెటప్‌లలో కనిపించాడు. దీంతో అతడు డుయల్ రోల్ చేస్తున్నాడని చెప్తున్నారు.
'దేవర' మూవీలో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో తాజాగా మరో క్రేజీ న్యూస్ లీకైంది. దీని ప్రకారం.. ఇందులో తారక్ ఏకంగా త్రిపాత్రాభినయం చేస్తున్నాడట. మూడో పాత్ర ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్‌లో ఎంట్రీ ఇస్తుందని తెలిసింది. ఆ పాత్ర రావడంతోనే ఇది ముగుస్తుందని సమాచారం. ఈ ట్విస్టుకు మైండ్ బ్లాక్ అవడం ఖాయం అని చెప్పొచ్చు.

ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ - కొరటాల కాంబోలో రాబోతున్న 'దేవర' మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో జాన్వీ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇందులో శ్రీకాంత్, చాకో సహా తదితరులు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











