ఎన్టీఆర్‌ కై బాలయ్య వ్యూహం

By Staff

Jr Ntr
తెలుగు దేశం పార్టీ ప్రచారానికి జూనియర్‌ ఎన్టీఆర్‌ నడుం బిగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అతని పర్యటన ఎన్నికల ప్రకటన వచ్చిన అనంతరమే ప్రారంభించాలని నిర్ణయించినట్లు సమాచారం. దాదాపు ఇరవై రోజుల పాటు ఏకదాటిగా ఎన్టీఆర్ పర్యటన ఉంటుందని తెలిసింది. ఇక బాలయ్యే స్వయంగా ఈ టూరు డైరీని తయారు చేస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ముఖ్యమైన మూడు ప్రాంతాల్లో రోడ్‌షోలు, సభల ద్వారా ఎన్టీఆర్‌ ప్రచారం చేసేందుకు అవసరమైన వ్యూహాన్ని తయారుచేస్తున్నట్లు తెలిసింది.సోమవారం తన సన్నిహితులు వద్ద బాలయ్య ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్‌ కంటే కాస్త ముందుగానే కల్యాణ్‌రామ్‌, తారకరత్నలు ప్రచారాన్ని చేపడతారు.

మరో ప్రక్క బాలయ్య ప్రచారం టూరు వివరాలు,బాధ్యతలను మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌రావు చూస్తున్నారు.పర్యటన ఏర్పాట్లను మాగంటి గోపీనాథ్‌ పర్యవేక్షిస్తున్నారు. ఇక బాలయ్య పర్యటన కోసం ప్రచార రథం యభై మంది పార్టీ కార్యకర్తలు ప్రత్యేకంగా సిద్ధమయ్యారు. రోడ్‌షోల్లో యాభై వేల మందిని ఉద్దేశించి మాట్లాడేందుకు అనుగుణంగా లక్ష వాట్లతో అత్యాధునిక సౌండ్ సిస్టమ్ ని ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్‌, చంద్రబాబు, బాలకృష్ణల ఫొటోలుండే తెల్లటీ షర్టు, జీన్స్‌ ప్యాంటుతో వాలంటీర్లకు ప్రత్యేక దుస్తులను రూపొందించారు. వాలంటీర్ల బృందం మంగళవారం బాలయ్యను కలిసి హిందూపూరం బయల్దేరి వెళ్ళనుంది. అలా బాబాయ్..అబ్బాయ్ లు ప్రచారానికి ప్రయాణం కడుతున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ పర్యటన పూర్తిగా పవన్ కళ్యాణ్ ప్రవాహానికి అడ్డుకట్టవేసేందుకే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X