RRR నుంచి సెన్సేషనల్ న్యూస్ లీక్: ఎన్టీఆర్ విషయంలో వివాదం.. సినిమాకు అడ్డంకులు వచ్చే ప్రమాదం

తెలుగు సినిమా ఖ్యాతి విశ్వవ్యాప్తం చేసిన దర్శకుడు.. టాలీవుడ్‌లో బడా హీరోలుగా వెలుగొందుతోన్న ఇద్దరు స్టార్లు.. ఖర్చుకు వెనుకాడని నిర్మాత.. ఎందరో హాలీవుడ్ బాలీవుడ్ ప్రముఖులు.. వీళ్లందరి కలయికలో సినీ చరిత్రలోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం RRR (రౌద్రం రణం రుధిరం). పేరుకు తెలుగు సినిమానే అయినా.. దేశ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించిన దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. దీంతో ఈ మూవీ కోసం అన్ని ఇండస్ట్రీల వాళ్లూ వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో RRR నుంచి తాజాగా ఓ సెన్సేషనల్ న్యూస్ లీకైంది. ఆ వివరాలు మీకోసం!

రియల్ హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్లు

రియల్ హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్లు

టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తోన్న చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం) అనే మూవీ చేస్తున్నాడు. విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని దానయ్య నిర్మాణంలో రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. ఇందులో చరణ్.. అల్లూరి గానూ, తారక్.. భీంగానూ నటిస్తున్నారు. కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్.

అప్పటి నుంచీ అడ్డంకులు.. ఇప్పుడు ఇలా

అప్పటి నుంచీ అడ్డంకులు.. ఇప్పుడు ఇలా

RRR మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమై రెండేళ్లకు పైగానే అవుతోంది. అయినప్పటికీ చాలా వరకు చిత్రీకరణ మిగిలిపోయింది. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇక, ఇటీవలే ఈ సినిమాలోని క్లైమాక్స్ సీక్వెన్స్‌ను ప్రారంభించారు. ఇందుకోసం అమెరికా నుంచి ఫైటర్లను కూడా తీసుకొచ్చారు. అయితే, ఇప్పుడు కరోనా ప్రభావంతో మరోసారి ఈ సినిమా షూటింగ్‌ను వాయిదా వేసేశారు.

రెండు వీడియోలూ అదుర్స్.. రికార్డులు బ్రేక్

రెండు వీడియోలూ అదుర్స్.. రికార్డులు బ్రేక్


పేరుకు తెలుగు సినిమానే అయినా RRR ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రం తరచూ సోషల్ మీడియాలో ట్రెండ్‌ను సెట్ చేస్తూనే ఉంది. అదే సమయంలో ఆ మధ్య వచ్చిన టైటిల్ మోషన్ పోస్టర్‌కు.. రామ్ చరణ్ 'భీం ఫర్ రామరాజు', ఎన్టీఆర్ 'రామరాజు ఫర్ భీం' టీజర్లు విడుదలయ్యాయి. ఈ రెండు వీడియోలూ సినీ ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టేశాయి.

మూడోది కూడా కష్టమే.. అనుకున్నట్లుగానే

మూడోది కూడా కష్టమే.. అనుకున్నట్లుగానే

RRR మూవీని జూలై 30, 2020న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ షూటింగ్ ఆరంభంలో ప్రకటించింది. కానీ, అనుకున్న తేదీకి చిత్రీకరణ పూర్తి కాకపోవడంతో జనవరి 8, 2021కి వాయిదా వేశారు. ఆ తర్వాత లాక్‌డౌన్ సహా పలు కారణాల వల్ల దీన్ని అక్టోబర్ 13, 2021న విడుదల చేస్తామని వెల్లడించారు. మళ్లీ అదే పరిస్థితి రావడంతో వాయిదా పడడం ఖాయంగా కనిపిస్తోంది.

RRR నుంచి సెన్సేషనల్ న్యూస్ బయటకు

RRR నుంచి సెన్సేషనల్ న్యూస్ బయటకు

RRR సినిమా విషయంలో ఏదీ బయటకు రాకూడదు అన్న పట్టుదలతో ఉన్నాడు దర్శకుడు రాజమౌళి. కానీ, దీని నుంచి ప్రతీదీ లీక్ అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఎన్నో ఫొటోలు, వీడియోలు, కొన్ని సర్‌ప్రైజ్‌లు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రతిష్టాత్మక చిత్రం నుంచి ఓ సెన్సేషనల్ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది.

ఎన్టీఆర్ విషయంలో వివాదాస్పద నిర్ణయాలు

ఎన్టీఆర్ విషయంలో వివాదాస్పద నిర్ణయాలు

ఈ భారీ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తోన్న విషయం తెలిసిందే. అతడికి జోడీగా హాలీవుడ్ బ్యూటీ ఒలీవియో మోరిస్ నటిస్తోంది. అలాగే, అతడిని ప్రేమించే మరో పాత్రను కూడా ఇందులో చూపించబోతున్నారని ఆ మధ్య ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఈ పాత్రలో కోలీవుడ్ భామ ఐశ్వర్య రాజేష్ నటిస్తుందని కూడా ప్రచారం జరిగింది. ఆ సమయంలో దీనిపై వ్యతిరేకత వచ్చింది.

సినిమాకు అడ్డంకులు వచ్చే ప్రమాదం అంటూ

సినిమాకు అడ్డంకులు వచ్చే ప్రమాదం అంటూ

కొమరం భీం పాత్రధారి ఎన్టీఆర్.. ఆ మధ్య వచ్చిన టీజర్‌లో ముస్లిం గెటప్‌లో కనిపించాడని పెద్ద రచ్చే నడిచింది. ఈ నేపథ్యంలో ఆయన ఇద్దరిని ఇష్టపడినట్లు ఇందులో చూపించబోతున్నారని తాజాగా ఓ న్యూస్ లీకైంది. అంటే ఎన్టీఆర్ ఏకంగా ఇద్దరు హీరోయిన్లను ప్రేమిస్తున్నట్లు డిజైన్ చేస్తున్నారట. ఇదే జరిగితే సినిమాకు అడ్డంకులు వచ్చే ప్రమాదం ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X