ఎన్టీఆర్ నెక్ట్స్ కూడా మల్టీస్టారరే.. స్టార్ హీరో స్టేట్‌మెంట్‌తో సీక్రెట్ రివీల్
తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొంచెం స్పెషల్ అనే చెప్పాలి. యాక్టింగ్, డ్యాన్స్, డైలాగ్ డెలివరీ, ఫైట్స్ ఇలా అన్నింటిలోనూ మెప్పించే అతడు.. ఇండస్ట్రీలో ఆల్‌రౌండర్‌గా పేరు సంపాదించుకున్నాడు. అదే సమయంలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సైతం దక్కించుకున్నాడు. కొన్నేళ్లుగా వరుస విజయాలతో దూసుకుపోతూ టాప్ పొజిషన్‌కు చేరువవుతున్నాడు. ప్రస్తుతం అతడు ప్రతిష్టాత్మక చిత్రంలో నటిస్తున్నాడు. ఇది షూటింగ్ జరుపుకుంటుండగానే.. తారక్ మరో సినిమాకు ఓకే చెప్పేశాడని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ఇందులో అతడితో పాటు మరో హీరో కూడా నటిస్తున్నాడట. హాట్ టాపిక్ అవుతున్న ఈ న్యూస్ మీకోసం..!

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు హిట్లు
కొద్ది రోజుల క్రితం వరకూ వరుస పరాజయాలతో ఇబ్బందులు ఎదుర్కొన్న జూనియర్ ఎన్టీఆర్.. ‘టెంపర్' సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాడు. అక్కడి నుంచి అతడు వరుసగా ‘నాన్నకు ప్రేమతో', ‘జనతా గ్యారేజ్', ‘జై లవ కుశ', ‘అరవింద సమేత.. వీరరాఘవ' సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నాడు ఈ నందమూరి వారి అబ్బాయి.

మళ్లీ ఆయనతో కలిశాడు.. ఈ సారి ఎలా ఉంటుందో
రాజమౌళి - ఎన్టీఆర్ కాంబో ఇప్పటికే మూడు హిట్ చిత్రాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ జంట మరోసారి కలిసి పని చేస్తోంది. ‘RRR' అనే టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాలో తారక్‌తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్.. కొమరం భీం పాత్రను పోషిస్తున్నాడు.

ఎన్టీఆర్ తర్వాతి సినిమాపై ఊహాగానాలు
ప్రతిష్టాత్మక చిత్రం RRR తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఏ సినిమానూ చేస్తానని ప్రకటించలేదు. కానీ, అతడితో ‘కేజీఎఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్, తమిళ దర్శకుడు అట్లీ సినిమాలు చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. వాళ్లతో పాటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నాడని అన్నారు. అయితే, వీటిపై ఎటువంటి క్లారిటీ రాలేదు.

తర్వాతి మూవీ కూడా మల్టీ స్టారరే
ఎన్టీఆర్ చేయబోయే తర్వాతి చిత్రం విషయంలో తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. దాని ప్రకారం.. తారక్ తర్వాతి చిత్రం కూడా మల్టీ స్టారరే అని అంటున్నారు. ఇందులో ఈ నందమూరి హీరోతో పాటు విక్టరీ వెంకటేష్ నటిస్తారని ఇండస్ట్రీలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అంతేకాదు, ఈ సినిమా 2020 ద్వితియార్ధంలో పట్టాలెక్కబోతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది.

స్టార్ హీరో సీక్రెట్ రివీల్
ప్రస్తుతం విక్టరీ వెంకటేష్.. నాగ చైతన్యతో కలిసి ‘వెంకీ మామ' సినిమాలో నటించాడు. ఇది శుక్రవారం విడుదలైంది. అంతకుముందు ఈ సినిమా ప్రమోషన్‌లో వెంకటేష్ మల్టీ స్టారర్ మూవీ గురించి ఓ ప్రకటన చేశాడు. ‘మేము నానితో ఓ సినిమా అనుకున్నాం. అది వర్కౌట్ అవడం లేదు. నాకు మాత్రం ఎన్టీఆర్‌తో సినిమా చేయాలని ఉంది' అంటూ చెప్పుకొచ్చాడు.
Recommended Video

ప్లాన్ చేసింది ఆ యంగ్ హీరోనే
వాస్తవానికి ఆకుల శివ అనే రచయిత సురేష్ బాబుకు కథ వినిపించారని ఇటీవల ఓ వార్త బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో వెంకీతో పాటు నాని నటిస్తాడని అన్నారు. కానీ, నాని వరుస ప్రాజెక్టుల వల్ల ఈ సినిమా చేయలేనని చెప్పాడని గుసగుసలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే సురేష్ బాబు తనయుడు రానా.. తారక్ పేరును ప్రతిపాదించాడని సమాచారం. ఈ కథను తారక్‌కు వినిపించారని, కొన్ని మార్పులు చేస్తే నటిస్తానని చెప్పాడని టాక్.


Click it and Unblock the Notifications











