ఎన్టీఆర్ డెడికేషన్ అట్లుంటది మరి! ‘డ్రాగన్'కోసం ఏం చేస్తున్నారో తెలుసా?

యంగ్ టైగర్‌ జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం పూర్తిగా సిద్ధమవుతున్నాడు. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం 'డ్రాగన్' అనే వర్కింగ్ టైటిల్ తో ప్రచారంలో ఉంది. 'కేజీఎఫ్', 'సలార్' వంటి బ్లాక్‌బస్టర్‌ల తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ కావడంతో, ఈ కాంబినేషన్‌పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. డ్రాగన్ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ కేవలం లుక్ మాత్రమే కాదు, తాజాగా ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ కోసం ఆయన ఒక అరుదైన యుద్ధ విద్యలో కఠినమైన శిక్షణ తీసుకుంటున్నారట. ఇంతకీ ఆ శిక్షణ ఏంటీ?

డ్రాగన్ సినిమాకు యాక్షన్ ప్రధాన బలం. సాధారణ మాస్ ఫైట్‌లకు బదులుగా రియలిస్టిక్, గ్రౌండ్-లెవల్ యాక్షన్‌ను చూపించాలని భావిస్తున్నారట. ఇందుకోసం .. ఎన్టీఆర్ కేరళకు చెందిన అత్యంత పురాతనమైన, శక్తివంతమైన యుద్ధ విద్య 'కలరిపయట్టు' నేర్చుకుంటున్నారట. ఈ విద్యలో పట్టు సాధించడం అంత సులభం కాదు. దీనికోసం ఎంతో ఏకాగ్రత, శారీరక దృఢత్వం అవసరం. ప్రశాంత్ నీల్ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ రేంజ్‌లో ఉండబోతున్నాయని, అందుకే హీరో స్వయంగా డూప్ లేకుండా ఈ విద్యను ప్రదర్శించేలా సిద్ధమవుతున్నారని సమాచారం. ఈ సినిమాలోని గ్యాంగ్ వార్, యాక్షన్ సన్నివేశాల కోసం ప్రత్యేకంగా ఈ కలరిపయట్టు శిక్షణ ఉపయోగపడుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Jr NTR Trains in Kalaripayattu for Dragon Prashanth Neel s Next Big Action Film

ఈ సినిమా షూటింగ్ మాత్రమే కాకుండా అంతర్జాతీయ లొకేషన్లలో కూడా జరగనుందని సమాచారం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న 'డ్రాగన్' సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. హీరోయిన్‌గా రుక్మిణి వసంత్ నటిస్తుండగా, బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించారు. మరోవైపు, మలయాళ నటుడు టోవినో థామస్ ఈ ప్రాజెక్ట్ నుంచి డేట్స్ సమస్యల కారణంగా తప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో 'డ్రాగన్'లో మరో నెగెటివ్ పాత్రలో ధురంధర్ ఫేమ్, బాలీవుడ్ నటుడు బిమల్ ఒబెరాయ్ కనిపించనున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే షూటింగ్‌లో కూడా ఆయన పాల్గొన్నట్లు సమాచారం.

ప్రశాంత్ నీల్ సినిమాల్లో హీరో-విలన్ మధ్య పోరు ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో తెలుస్తుంది. 'కేజీఎఫ్‌'లో గరుడ, 'సలార్‌'లో వర్ధరాజ మన్నార్ పాత్రల తరహాలో, ఈ సినిమాలో కూడా బలమైన ప్రతినాయకుడిని చూపించేందుకు ప్రత్యేకంగా ప్లాన్‌ని అందిస్తుంది. ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే, 'వార్ 2' తర్వాత ఈ సినిమాతో తన మాస్, ఎమోషనల్ పవర్‌ను మరింత భారీ స్థాయిలో ప్రదర్శించేలా దృఢ సంకల్పంతో ఉన్నాడు. తన లుక్‌ను పూర్తిగా మార్చుకుని ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ చేయడం, ప్రత్యేక శిక్షణలు తీసుకోవడం చూస్తుంటే.. ఎన్టీఆర్ డెడికేషన్ అట్లుంటది మరి అన్నట్టు ఉంది.

ఇక మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు. అయితే 2026లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తానికి, ప్రశాంత్ నీల్ స్టైల్ ఎలివేషన్స్, ఎన్టీఆర్ ఎనర్జీ, రియలిస్టిక్ యాక్షన్ అన్ని కలిస్తే 'డ్రాగన్' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ సంచలనాలు సృష్టించడం ఖాయం అనిపిస్తోంది. ఇక ఈ హై వోల్టేజ్ కాంబినేషన్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Read more about: jr ntr prashanth neel dragon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X