తారక్ నెక్ట్స్ డీటేల్స్ లీక్: చిరంజీవి సినిమాలో జూనియర్ ఎన్టీఆర్.. అదిరిపోయే ప్లాన్ వేసిన త్రివిక్ర

By Manoj

నందమూరి ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ప్రవేశించినా.. యాక్టింగ్, డ్యాన్స్, డైలాగ్ డెలివరీ, ఫైట్స్, కామెడీ ఇలా అన్నింటిలోనూ రాణిస్తూ ఆల్‌రౌండర్‌గా పేరు సంపాదించుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. కెరీర్ ఆరంభంలోనే ఇండస్ట్రీ హిట్లు కొట్టి చిన్న వయసులోనే స్టార్ హీరో అయిపోయాడు. సినిమా సినిమాకూ వేరియేషన్ చూపిస్తూ సక్సెస్ అవుతున్నాడు. ఇక, ఎన్టీఆర్ నటించబోయే తర్వాతి సినిమాకు సంబంధించిన వివరాలు తాజాగా లీక్ అయ్యాయి. దాని ప్రకారం.. చిరంజీవి సినిమాలో అతడు నటించబోతున్నాడట. ఆ సంగతులేంటో చూద్దాం.!

Recommended Video

NTR 30 : Jr NTR Trivikram Movie Link With Chiranjeevi's Blockbuster Film || Filmibeat Telugu
 వరుసగా ఐదు.. ఎన్టీఆర్‌కు తిరుగులేదు

వరుసగా ఐదు.. ఎన్టీఆర్‌కు తిరుగులేదు

ఆ మధ్య వరుస పరాజయాలతో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు జూనియర్ ఎన్టీఆర్. అయితే, పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘టెంపర్'తో అతడు హిట్ ట్రాక్ ఎక్కాడు. ఆ సినిమా నుంచి వెనుదిరిగి చూడని తారక్.. వరుసగా ‘నాన్నకు ప్రేమతో', ‘జనతా గ్యారేజ్', ‘జై లవ కుశ', ‘అరవింద సమేత.. వీరరాఘవ' వంటి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

ప్రతిష్టాత్మక చిత్రంలో భాగస్వామి అయ్యాడు

ప్రతిష్టాత్మక చిత్రంలో భాగస్వామి అయ్యాడు

ప్రస్తుతం తారక్.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ చిత్రం RRRలో రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్నాడు. ఇందులో అతడు కొమరం భీంగా కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం తారక్ లుక్ పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇందులో అతడికి జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది.

తర్వాతి సినిమా ఎవరితో.. క్లారిటీ వచ్చింది

తర్వాతి సినిమా ఎవరితో.. క్లారిటీ వచ్చింది

RRR షూటింగ్‌తో బిజీగా ఉన్న తారక్ గురించి కొద్ది నెలలుగా ఎన్నో వార్తలు ప్రచారం అయ్యాయి. ఎన్టీఆర్ తన తర్వాతి సినిమాను పలానా దర్శకుడితో చేస్తున్నాడనేవే ఆ వార్తల సారాంశం. ఈ క్రమంలోనే కన్నడ, తమిళ ఇండస్ట్రీలతో పాటు తెలుగులోని ఎంతో మంది దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే, అతడు త్రివిక్రమ్‌తో సినిమా చేస్తున్నట్లు ఇటీవల ప్రకటన వెలువడింది.

ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి లాగుతున్నాడు

ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి లాగుతున్నాడు

త్రివిక్రమ్‌తో తారక్ సినిమా చేస్తున్నట్లు ప్రకటన రాకముందే దీనికి సంబంధించిన వార్తలు బయటకు వచ్చాయి. అంతేకాదు, వీళ్లిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ మూవీకి ‘అయిననూ పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరిగింది. దీంతో ఇది పొలిటికల్ బేస్‌డ్ మూవీ అనే టాక్ వినిపిస్తోంది. ఇందులో తారక్ పొలిటీషియన్‌గా కనిపిస్తాడని అంటున్నారు.

 చిరంజీవి సినిమాలో జూనియర్ ఎన్టీఆర్

చిరంజీవి సినిమాలో జూనియర్ ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా కథకు సంబంధించిన వివరాలు తాజాగా లీక్ అయ్యాయి. దీని ప్రకారం... గతంలో చిరంజీవి నటించిన ‘మంత్రి గారి వియ్యంకుడు' అనే సినిమా లైన్‌తోనే ఇది తెరకెక్కబోతుందట. మంత్రి కుమారుడికి తన చెల్లిని ఇచ్చి పెళ్లి చేసేందుకు హీరో చేసే ప్రయత్నాలే సినిమా మెయిన్ లైన్ అని అంటున్నారు.

అదిరిపోయే ప్లాన్ వేసిన త్రివిక్రమ్.!

అదిరిపోయే ప్లాన్ వేసిన త్రివిక్రమ్.!

తివిక్రమ్ తన గత చిత్రం ‘అల.. వైకుంఠపురములో' కూడా సీనియర్ ఎన్టీఆర్ నటించిన ‘ఇంటి గుట్టు' అనే సినిమా నుంచి స్ఫూర్తి పొంది తీశాడు. ఇది సూపర్ హిట్ అవడంతో మరోసారి అదే తరహా ప్రయోగం చేయబోతున్నాడని అంటున్నారు. అందుకే ఈ సారి మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మంత్రి గారి వియ్యంకుడు'ను ప్రేరణగా తీసుకున్నాడని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X