త్రివిక్రమ్ - ఎన్టీఆర్ మూవీ.. ఇంకా కథ పూర్తవ్వలేదట?

జూనియర్ ఎన్టీఆర్ RRR అయిపోగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా స్టార్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే. 'అల.. వైకుంఠపురములో' వంటి బాక్సాఫీస్ హిట్ అనంతరం త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో ఇండస్ట్రీలో అంచానాల డోస్ పెరుగుతున్నాయి. ఇక సినిమాకు సంబంధించిన ఎనౌన్స్మెంట్ తరువాత ఇంతవరకు మరో అప్డేట్ ఇవ్వలేదు.

మొదట జూనియర్ ఎన్టీఆర్ కి త్రివిక్రమ్ పూర్తి కథను చెప్పలేదు. కేవలం సింగిల్ లైన్ ని మాత్రమే చెప్పాడు. పాయింట్ నచ్చడంతో తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఎనౌన్స్మెంట్ చేశారు. ఆ నమ్మకంతో ప్రస్తుతం త్రివిక్రమ్ కథను పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఇప్పటికే ఫస్ట్ హాఫ్ ని పూర్తిగా రెడీ చేసినట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ కూడా విన్నట్లు తెలుస్తోంది.

Jr ntr trivikram project latest update

ఇక సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి ఫుల్ కథతో మరోసారి ఈ ఇద్దరు కలవనున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఫైనల్ స్క్రిప్ట్ కి ఒకే చెబితే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని త్రివిక్రమ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశం లేదు కాబట్టి మాటల మాంత్రికుడు సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ కోసం కాస్త ఎక్కువ సమయమే తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X