జూనియర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబో.. అందులో నిజం లేదట!
జూనియర్ ఎన్టీఆర్ 30వ సినిమాకు దర్శకుడిగా ఫిక్స్ అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ గత ఎడాది నుంచి ప్రాజెక్టు కోసం రకరకాల ప్లాన్స్ వేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఊహించని విధంగా ప్రాజెక్టు క్యాన్సిల్ అవ్వడంతో అభిమానులందరు షాక్ అయ్యారు. తారక్ సడన్ గా తప్పుకోవడమే కాకుండా కొరటాల శివతో కొత్త ప్రాజెక్ట్ సెట్ చేసుకోవడం అందరిని షాక్ కు గురి చేసింది.
అసలు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అనే విషయంలో ఇంతవరకు నిజం బయటకు రాలేదు. ఎవరు కూడా చెప్పలేదు. దీంతో ఎదో జరిగే ఉంటుందనే రూమర్స్ ఎక్కువగా వస్తున్నాయి. అయితే ఈ రూమర్స్ ఎన్ని వచ్చినా కూడా త్రివిక్రమ్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ లేదని మరొక టాక్ గట్టిగా వినిపిస్తోంది. భవిష్యత్తులో వాళ్ళిద్దరూ మళ్ళీ తప్పకుండా కలుస్తారని సమాచారం. ఇక త్రివిక్రమ్ చేయబోయే తదుపరి సినిమా మహేష్ బాబుతో ఉండబోతోంది.

అయితే ఆ కథ ఎన్టీఆర్ కు చెప్పిందని వస్తున్న వార్తల్లో కూడా నిజం లేదట. మహేష్ కు పూర్తిగా వేరే కథను చెప్పినట్లు సమాచారం. ఇక త్రివిక్రమ్ తో జూనియర్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది ఉండవచ్చని మరొక టాక్ కూడా వైరల్ అవుతోంది. అప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ కు సరైన కథ సెట్టవ్వకపోతే త్రివిక్రమ్ కథను పట్టాలెక్కించే ఛాన్స్ ఉందని సమాచారం. మరి ఈ రూమర్స్ అన్ని ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఓపిక పట్టాల్సిందే.


Click it and Unblock the Notifications











