జూ ఎన్టీఆర్ ని నెంబర్ వన్ హీరో చేయడమే మామ సంకల్సం...
జూ ఎన్టీఆర్ కి ఉన్న స్టార్ ఇమేజ్ ని ఎవరూ ప్రశ్నించలేరు కనీ అతని ఇమేజ్ కి తగ్గ విజయాలు మాత్రం కొద్ది కాలంగా రావడం లేదు. ముఖ్యంగా పోకిరి చిత్రాన్ని అధిగమించే విషయంలో ఇంతవరకు ఎన్టీఆర్ విఫలమవుతూనే వచ్చాడు. ఇక మగధీరలో అయితే సగం కూడా అతని సినిమాలు వసూలు చేయడం లేదు. భావితరానికి నెంబర్ బన్ హీరో కావాలనే ధ్యేయంతో ఉన్న నటుడికి ఇది ఆశాఆజనకమైన పరిస్థితి కాదు.
అందుకే జూ ఎన్టీఆర్ కొన్ని భారీ చిత్రాలని చేయాలని సంకల్పిస్తున్నాడు. మగధీర చిత్రం మాదిరిగా భారీ వ్యయంతో రూపొందే పౌరాణిక, చారిత్రిక సినిమాలు చేయడానికి ఎన్టీఆర్ వ్యూహం సిద్దం చేసుకుంటున్నాడు. ఎన్టీఆర్ ని నెంబర్ వన్ హీరోగా చూడాలని అతని భార్య, మామ కూడా కోరుకుంటూ ఉండడం అతనికి ప్లస్ పాయింట్. కోటానుకోట్లకి అధిపతి అయిన జూ ఎన్టీఆర్ మామ తన అల్లుడితో భారీ సినిమాలు నిర్మించి అతని భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండేలా తీర్చిదిద్దాలని చూస్తున్నాడు..


Click it and Unblock the Notifications











