జూ ఎన్టీఆర్ మూడీగా ఉండటానికి కారణం అదా....!?

By Sindhu

యంగ్ ఏజ్ లోనే మాస్ హీరో ఇమేజ్ వచ్చేయడంతో కత్తిపట్టుకుని నరకడం తప్ప ఏం చేసినా ఎన్టీఆర్ ని ఫాన్స్ రిజెక్ట్ చేస్తున్నారు. ఈ ఇమేజ్ తో ఎన్ని లాభాలున్నాయో అన్ని నష్టాలు కూడా వున్నాయని గ్రహించిన ఎన్టీఆర్ తన మాస్ ఇమేజ్ ని కంటిన్యూ చేస్తూనే యూత్ ని, ఫ్యామిలీస్ ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.అయితే ఇంతదాకా అతని ప్రయత్నాలు ఫలితాలనిస్తున్నట్టు కనిపిస్తున్నట్టు లేదు. 'అదుర్స్" హిట్టని మొత్తుకున్నారు కానీ నిర్మాతలకి మాత్రం దాదాపు అయిదు కోట్లు లాస్ వచ్చిందనేది ట్రేడ్ రిపోర్ట్. తన ఇమేజ్ తో పూర్తిగా ప్రయోగం చేయలేక..ఫ్యామిలీ, యూత్ ఫుల్ ఎలిమెంట్స్ ఎంత మిక్స్ చేయించాలో తెలీక తాను తంటాలు పడడమే కాకుండా, అటు దర్శకులని కూడా ఎన్టీఆర్ ఇబ్బంది పెడుతున్నాడు.

ఎన్టీఆర్ నటిస్తున్న పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రం 'బృందావనం" విషయంలో కూడా అతడిని ఈ 'బ్యాలెన్సింగ్" యాక్ట్ బాధిస్తోందట. మరీ సాప్ట్ సినిమా చేస్తే కొత్తగా ఫాన్స్ ని సంపాదించుకోవడం పోయి వున్న అభిమానులని కూడా నిరాశ పరుస్తానేమోననిఅందోళన చెందుతున్నాడట. కథలో అంతగా ఇమడకపోయినా కానీ ఫైట్లు పెట్టించిన ఎన్టీఆర్, తగినన్ని పంచ్ డైలాగులు లేవని పదే పదే కంప్లయింట్ చేసేవాడట. 'సింహా" సినిమాకి పవర్ ఫుల్ డైలాగులే ప్లస్ అయ్యాయని అంటూ అలాంటివి ఇందులోను వుంటే బాగుంటుందని అస్తమానం అనేవాడట.

కథకి సూట్ కాకపోయినా ఎన్టీఆర్ ని కాదనలేక అలాంటిడైలాగులు 'బృందావనం"లో కొన్ని పెట్టారని అయితే ఈ డోసు చాలదనే అనుమానంతో ఎన్టీఆర్ హ్యాపీగా లేడనీ తెలుస్తోంది. ఎన్టీఆర్ ఇమేజ్ ని బ్యాలెన్స్ చేయడమేమో కానీ ఇలా అక్కర్లేని మసాలాలతో మొత్తంగా సినిమానే బ్యాలెన్స్ తప్పుతుందేమో అనే సందేహాలు సైతం వ్యక్తమవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X