NTR30: పవన్ కోసం అనుకున్న టైటిల్ ఇప్పుడు ఎన్టీఆర్ కోసం.. ఫిక్స్ అయినట్లే?
జూనియర్ ఎన్టీఆర్, మల్టీస్టారర్ RRR సినిమాతో గ్లోబల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని అందుకొని ఇప్పుడు తదుపరి సినిమాతో సోలోగా మరో సక్సెస్ అందుకోవాలని అనుకుంటున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టుపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ కోసం మొదట పవన్ కళ్యాణ్ సినిమా కోసం అనుకున్న టైటిల్ నీ ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇంతకు ఆ టైటిల్ ఏమిటి అనే వివరాల్లోకి వెళితే..
మరో సక్సెస్ అందుకోవాలి అని..:జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ తో కలిసి నటించిన RRR సినిమా దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి గుర్తింపును అందుకున్న విషయం తెలిసిందే. ఆస్కార్ వరకు వెళ్లిన ఈ సినిమా ద్వారా అటు రామ్ చరణ్ తో పాటు ఇటు జూనియర్ ఎన్టీఆర్ కూడా గ్లోబల్ స్టార్ గా క్రేజ్ అయితే అందుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఎవరికి వారు సొంతంగా సోలోగా మరో సక్సెస్ అందుకోవాలి అని ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇంటర్నేషనల్ మార్కెట్లో..:జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమా తర్వాత కొరటాల శివతో చేస్తున్న సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ముఖ్యంగా RRR సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడంతో తప్పకుండా ఇంటర్నేషనల్ మార్కెట్లో ఈ సినిమాకు మంచి డిమాండ్ అయితే ఏర్పడుతుంది. అయితే సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ విషయంలో కూడా జాగ్రత్తగా అడుగులు వేస్తేనే పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి. ఆ విషయంలో చిత్ర యూనిట్ మొదట నుంచి కూడా సరైన ప్రణాళికతో ముందుకు సాగనున్నట్లుగా తెలుస్తోంది.

స్టార్ క్యాస్ట్.. మరొక బ్యూటీ?:ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ మెయిన్ విలన్ గా నటిస్తూ ఉండగా మరి కొంతమంది ప్రముఖ యాక్టర్స్ ముఖ్యమైన పాత్రలలో కనిపించబోతున్నారు. ఇక గ్లామరస్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా సెలెక్ట్ అయిన విషయం తెలిసిందే. అలాగే మరొక సైడ్ హీరోయిన్ పాత్ర కోసం దర్శకుడు మరొకరిని సంప్రదించినట్లుగా కూడా కథనాలు వినబడుతున్నాయి.

పవన్ కోసం అనుకున్న టైటిల్?:అయితే ఎన్టీఆర్ 30వ సినిమా కోసం ఎలాంటి టైటిల్ అనుకుంటున్నారు అనే విషయంలో కూడా అనేక రకాల వార్తలు అభిమానులను కన్ఫ్యూజన్ కు గురి చేస్తున్నాయి. మొదట ఈ సినిమాకు 'వస్తున్నా' అనే టైటిల్ అనుకుంటున్నట్లుగా కొన్ని గాసిప్స్ అయితే వచ్చాయి. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా కోసం అనుకున్న ఒక టైటిల్ ఇప్పుడు ఎన్టీఆర్ 30వ సినిమా కోసం ఫిక్స్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఈ టైటిల్ ఫిక్స్ అయినట్లేనా?:పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ తో చేస్తున్న వినోదాయ సీతం రీమేక్ కోసం మొదట 'దేవర' అనే టైటిల్ అనుకున్నట్లు టాక్ అయితే వినిపించింది. ఆ తర్వాత ఆ సినిమాకు 'బ్రో' అనే టైటిల్ కూడా అనుకున్నట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే ఇప్పుడు దేవర అనే టైటిల్ ఎన్టీఆర్ 30వ సినిమా కోసం ఫిక్స్ చేస్తే అవకాశం ఉన్నట్లుగా ఇండస్ట్రీలో ఒకటాక్ అయితే వినిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అధికారికంగా క్లారిటీ వచ్చేవరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











