NTR 30: టార్గెట్ ఫిక్స్ చేసుకున్న ఎన్టీఆర్.. ఈ ఏడాది చివరలో ఊహించని ట్విస్ట్!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ఎన్టీఆర్ 30 సినిమా షూటింగ్ కూడా ఇటీవలే ప్రారంభం అయింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ కు ఇది 30వ సినిమా కావడంతో దీనికి ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.
అయితే ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కూడా హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలోనే జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమాలోని కీలక పోరాట సన్నివేషాల చిత్రీకరణ సోమవారం రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలైంది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ తదితరుల నేపథ్యంలో ఈ కీలక ఫైట్ ను రూపొందిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనడానికే ముంబయి నుంచి హైదరాబాద్ లో దిగింది జాన్వీ కపూర్.

అయితే RRR తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ క్రమంలోనే స్క్రిప్టు పూర్తవడానికే దాదాపు ఏడాది సమయం తీసుకున్నారు డైరెక్టర్. అప్పటి వరకు తారక్ చాలా ఎదురు చూశారు. ఎవరూ వారిని టెన్షన్ పెట్టొద్దని, సినిమా ఎప్పుడు, ఎప్పుడు అంటూ అడగొద్దని అభిమానులకు సూచించాడు. దానివల్ల సినిమాపై ఎఫెక్ట్ పడుతుందని కూడా అన్నారు.
ఎట్టకేలకు ఏడాది తర్వాత సినిమా షూటింగ్ ప్రారంభించారు. అయితే సినిమా చిత్రీకరణకు స్క్రిప్టు రాయడానికి పట్టినంత ఎక్కువ సమయం పట్టేలా లేదు. నవంబర్ నాటికల్లా ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే ఏడాది తారక్ మరో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ట్విస్ట్ ఇవ్వనున్నాడు. నవంబర్ నెలలో కొరటాల సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని డిసెంబర్ నెలలో వార్ 2 సినిమా షూటింగ్ లో పాల్గొంటారట జూనియర్ ఎన్టీఆర్.
అయితే ఎన్టీఆర్ 30 సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కూడా నటించబోతున్నారు. ఈ సినిమా ఓ కల్పిత దీవి. పోర్టు నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ కొరటాల శివ. కథా నేపథ్యం ఈ ట్వంటీయెత్ సెంచరీ కాదని సమాచారం. సెమీ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ సెలెక్ట్ చేశారట డైరెక్టర్. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











