జూనియర్ ఎన్టీఆర్ మాములోడు కాదు.. మూడేళ్లకు సరిపోయేంతగా..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఈ మధ్య కాలంలో తొందరపడి సినిమాలు చేయడం లేదు. ముఖ్యంగా ఫామ్ లో ఉన్న దర్శకులు కథలు చెప్పడానికి వచ్చినా వారు చెప్పింది నమ్మేసి ప్రాజెక్టులకు ఒకే చేయడం లేదు. కథలో మంచి సరుకుంటేనే ముందుకు వెళుతున్నాడు. తారక్ కెరీర్ లో కూడా ఎన్నో డిజాస్టర్స్ ఉన్నాయి. ముఖ్యంగా భారీ హైప్ క్రియేట్ చేసి చతికిల పడ్డ సినిమాలు ఎక్కువ.

అలాంటి తప్పు మళ్ళీ చేయకుండా..

అలాంటి తప్పు మళ్ళీ చేయకుండా..

సాధారణంగా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకుంటే ఆ తరువాత వచ్చే సినిమా అంచనాలకు తగ్గట్టుగా ఆడటం లేదు. నరసింహుడు, శక్తి సినిమాలతో యంగ్ టైగర్ చాలా నేర్చుకున్నాడు. ఇక నెక్స్ట్ RRR సినిమా రాబోతోంది. ఆ సినిమా ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. ఆ సినిమా రిజల్ట్ పై అనుమానాలు చాలా తక్కువే. అయితే ఆ తరువాత ఎన్టీఆర్ కెరీర్ ని ఎలా సెట్ చేసుకుంటాడు అనేదే హాట్ టాపిక్ గా మారింది.

మూడేళ్ల వరకు ఇబ్బంది లేకుండా..

మూడేళ్ల వరకు ఇబ్బంది లేకుండా..

లాక్ డౌన్ సమయంలో ఎటూ వెళ్ళలేని పరిస్థితి. కొంతమంది హీరోలు ఖాళీగా ఉండడం ఎందుకని దర్శకులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చెప్పే కథలు వింటున్నారు. అందులో ముఖ్యంగా తారక్ రోజు రెండు కథలైనా వింటున్నాడట. ఇప్పటికే KGF దర్శకుడితో డిస్కస్ చేసిన తారక్ మరొకసారి అతన్ని కలిసే అవకాశం ఉందట. ఇక కొరటాల శివతో కూడా ఒక సిట్టింగ్ అయినట్లు తెలుస్తోంది. అలాగే మరో ఇద్దరితో కూడా తారక్ కొత్త తరహా స్క్రిప్ట్స్ పై చర్చినట్లు సమాచారం. మొత్తంగా వచ్చే మూడేళ్ళ వరకు బిజీ అయ్యేలా కనీసం నాలుగు కథలను సిద్ధం చేసుకోవాలని తారక్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

త్రివిక్రమ్ తరువాత..

త్రివిక్రమ్ తరువాత..

RRR సినిమా వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా తరువాత
నెక్ట్స్ జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయబోతున్నాడు. అయితే ఆ సినిమా తరువాత ఏ దర్శకుడితో వర్క్ చేయనున్నాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ కరోనా ఇచ్చిన గ్యాప్ లో తారక్ టైమ్ వృధా కాకుండా స్క్రిప్ట్ లపై అయితే సుదీర్ఘంగా ఆలోచించి షెడ్యూల్స్ ప్లాన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

Recommended Video

Alia Bhatt Surprised All, Became Die Hard Fan Of Prabhas
మోహన్ లాల్ తో మరోసారి..

మోహన్ లాల్ తో మరోసారి..

రీసెంట్ గా అందిన సమాచారం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ మోహన్ లాల్ తో మరొకసారి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీరు మొదటిసారి కలిసి నటించిన జనతా గ్యారేజ్ ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పుడు మోహన్ లాల్ RRR సినిమాలో ఎన్టీఆర్ తో మరోసారి నటించే ఛాన్స్ ఉందట. ఒక ముఖ్యమైన పాత్ర కోసం రాజమౌళి మోహన్ లాల్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X