Salaar: ప్రభాస్ మూవీలో ఎన్టీఆర్.. సినిమాలో అదే హైలైట్‌గా.. రాఖీ భాయ్ వచ్చేది అప్పుడే!
సినీ నేపథ్యంతోనే హీరోగా పరిచయమైనా.. కెరీర్ ఆరంభంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుని స్టార్‌డమ్‌ను అందుకున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. కెరీర్ ఆరంభంలోనే తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఈ టాలెంటెడ్ హీరో.. మార్కెట్‌తో పాటు ఫాలోయింగ్‌ను భారీగా పెంచుకున్నాడు. అలాగే, 'బాహుబలి' చిత్రంతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. అప్పటి నుంచి వరుసగా భారీ చిత్రాలే చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రభాస్ కొత్త సినిమాలో ఇద్దరు స్టార్లు భాగం అవుతున్నారని తెలిసింది. ఆ వివరాలు మీకోసం!

‘సలార్'గా మారిన ప్రభాస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రమే 'సలార్'. యాక్షన్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. హాట్ బ్యూటీ శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. జగపతి బాబు ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు.

ఆటంకాలతోనే సాగుతోంది
పవర్‌ఫుల్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'సలార్' మూవీ రెగ్యూలర్ షూటింగ్‌ను గత ఏడాది ప్రారంభంలోనే మొదలు పెట్టారు. ఆ వెంటనే మొదటి షెడ్యూల్‌ను సింగరేణి బొగ్గు గనుల్లో, రెండో షెడ్యూల్‌ను హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో పూర్తి చేశారు. కానీ, ఆ తర్వాత వరుసగా ఆటంకాలు ఎదురు కావడంతో ఈ సినిమా షూటింగ్ సజావుగా సాగడంలేదు.

రిలీజ్ డేట్.. ముందే రిలీవ్
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న 'సలార్' మూవీ రిలీజ్ పలుమార్లు వాయిదా పడింది. ఇక, దీన్ని 2023 సెప్టెబర్ 28న విడుదల చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. అందుకు అనుగుణంగానే షూటింగ్‌ను కంప్లీట్ చేయాలని ప్లాన్ చేశారు. మరీ ముఖ్యంగా ప్రభాస్‌కు సంబంధించిన సన్నివేశాలను మరింత త్వరగా పూర్తి చేసి అతడిని రిలీవ్ చేయబోతున్నారని టాక్.

ఎన్నో హైలైట్లు... సర్‌ప్రైజ్
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న 'సలార్' మూవీని ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తోన్నారు. ఇందులో ఎన్నో సర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేశారు. దీనికోసం ఇప్పటి వరకూ ఎవరూ వాడని టెక్నాలజీని కూడా వాడుతున్నారు. అంతేకాదు, సినిమాలో కూడా ఎన్నో కొత్త కాన్సెప్టులను చూపించబోతున్నారు. ఇలా ఈ చిత్రం ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇవ్వబోతుంది.

రాఖీ భాయ్ ఎంట్రీ సూపర్
పవర్‌ఫుల్ కాంబినేషన్‌లో ఎంతో వైల్డ్‌గా రాబోతున్న 'సలార్' మూవీలో ఎంతో మంది స్టార్లు భాగం అయ్యారు. ఇప్పటికే పలు ఇండస్ట్రీలకు చెందిన హీరోలను ఈ చిత్రంలో నటింపజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ యశ్ ఓ గెస్ట్ రోల్ చేస్తున్నాడని తెలిసింది. సినిమా ప్రీ క్లైమాక్స్ టైంలో రాఖీ భాయ్ అదిరిపోయే ఎంట్రీతో అలరించబోతున్నాడట.

ప్రభాస్ సినిమాలో ఎన్టీఆర్
పాన్ వరల్డ్ రేంజ్‌లో క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'సలార్' మూవీకి సంబంధించి తాజాగా మరో సెన్సేషనల్ న్యూస్ వైరల్ అవుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా భాగం కాబోతున్నాడట. అయితే, అతడు ఇందులో నటించడం లేదు.. ఈ చిత్రానికి తారక్ వాయిస్ ఓవర్ అందించబోతున్నాడట.

ఫస్ట్ నుంచి.. అన్ని భాషల్లో
'సలార్' మూవీని తక్కువలో తక్కువగా ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ అన్నింటిలోనూ జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించబోతున్నట్లు తెలిసింది. మొదటి నుంచి శుభం కార్డు పడే వరకూ సినిమాలో ఎన్టీఆర్ గొంతు పలుమార్లు వినిపిస్తుందని తెలిసింది. ఇదిలా ఉండగా.. ప్రశాంత్ నీల్ తన తదుపరి చిత్రాన్ని తారక్‌తోనే చేస్తున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











