విజయ్ దేవరకొండ మూవీలో ఎన్టీఆర్.. టాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ అవడం ఖాయం
తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే వచ్చినా తనదైన సినిమాలు చేస్తూ.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ. ఆరంభంలో వరుసగా హిట్లు మీద హిట్లు కొట్టిన అతడు.. ఈ మధ్య కాలంలో మాత్రం విజయాలకు దూరంగా ఉంటున్నాడు. అయినా ఏమాత్రం తగ్గకుండా మూవీలు చేస్తున్నాడు.
విజయ్ దేవరకొండ ఈ ఏడాదిలోనే 'ది ఫ్యామిలీ స్టార్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. ఇది అంచనాలను అందుకోలేకపోయింది. ఫలితంగా కలెక్షన్లు రాబట్టలేక డిజాస్టర్‌గా మిగిలింది. ఈ పరిస్థితుల్లో ఈ యంగ్ హీరో తన తదుపరి సినిమాపై ఫోకస్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు 'జెర్సీ' ఫేం గౌతమ్ తిన్ననూరితో మూవీని చేస్తున్నాడు.

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేసే సినిమాపై అంచనాలు హై రేంజ్‌లో ఉన్నాయి. అందుకు తగ్గట్లే దీని నుంచి వచ్చిన పోస్టర్‌లో పోలీస్ యూనిఫామ్‌లో ఓ వ్యక్తి ముఖానికి ముసుగు ధరించి ఉండటం ఆసక్తిని రేకెత్తించింది. అదే సమయంలో దీనిపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని తీస్తున్నారు.
విభిన్నమైన కాన్సెప్టుతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండతో పాటు పలు సినీ పరిశ్రమలకు చెందిన ఎంతో మంది నటీనటులు భాగం కాబోతున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ, ఇప్పటి వరకూ ఎవరి పేరు కూడా బయటకు రాలేదు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ కూడా ఉన్నట్లు తెలిసింది.

క్రేజీ యాక్షన్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో హీరో విజయ్ దేవరకొండ పాత్రను ఎలివేట్ చేసేలా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చాడట. వాస్తవానికి ఇందుకోసం చాలా మందిని అనుకున్నా తారక్ గొంతు అయితేనే బాగా ఇంపాక్ట్ ఉంటుందని దర్శక నిర్మాతలు భావించినట్లు తెలిసింది. దీనికితోడు నాగ వంశీ అడగడంతో ఎన్టీఆర్ వెంటనే ఒప్పుకున్నాడట. ఇక, యంగ్ టైగర్ వాయిస్‌తో విజయ్ దేవరకొండను ఎలివేషన్‌ను చూసేందుకు ఫ్యాన్స్ ఉత్సాహపడుతున్నారు.
ఇదిలా ఉండగా.. స్పై థ్రిల్లర్ జోనర్‌లో రాబోతున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ , ఫార్ఛ్యూన్ ఫోర్ పతాకాలపై నాగవంశీ , సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. అలాగే, ఈ చిత్రానికి కోలీవుడ్ సెన్సేషన్ అనిరుథ్ రవిచందర్ సంగీతాన్ని కంపోజ్ చేస్తున్నాడు. ఇందులో భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తెలిసింది.


Click it and Unblock the Notifications











