ఎన్టీఆర్ - కొరటాల మూవీ నుంచి షాకింగ్ అప్‌డేట్: అన్నీ ఓకే.. కానీ ఆ విషయంలో ఇద్దరిదీ చెరో మాట
తెలుగు సినీ ఇండస్ట్రీలో యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్, పాటలు ఇలా అన్ని విభాగాల్లోనూ రాణిస్తూ ఆల్‌రౌండర్‌గా కితాబందుకున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. కెరీర్ ఆరంభంలోనే ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్న అతడు.. మధ్యలో చాలా ఫ్లాపులను ఎదుర్కొన్నాడు. ఇక, ఈ మధ్య ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేస్తున్నాడు. ఇది రాకముందే కొరటాల శివతో సినిమాను ప్రకటించాడు. తాజాగా ఈ ప్రాజెక్టు గురించి ఓ షాకింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా న్యూస్? పూర్తి వివరాలకై మొత్తం చదవండి!

వరుస విజయాలతో దూసుకెళ్తున్న స్టార్
కొంత కాలంగా జూనియర్ ఎన్టీఆర్ ఫుల్ ఫామ్‌లో కనిపిస్తున్నాడు. పూరీ జగన్నాథ్ రూపొందించిన 'టెంపర్' నుంచి మొదలుకొని 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్', 'జై లవ కుశ', 'అరవింద సమేత.. వీరరాఘవ' వంటి హిట్లను ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా డబుల్ హ్యాట్రిక్‌కు రెడీ అయ్యాడు. అదే సమయంలో రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు ఓకే చేస్తున్నాడీ స్టార్ హీరో.

గొప్ప చిత్రంలో భాగమైన నందమూరి హీరో
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తోన్న RRR (రౌద్రం రణం రుధిరం)లో రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్నాడు. అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇందులో చరణ్.. అల్లూరిలా, ఎన్టీఆర్.. కొమరం భీంలా నటిస్తున్నారు.

త్రివిక్రమ్‌ను కాదని.. కొరటాల శివతో జోడీ
RRR షూటింగ్ పూర్తి కాకముందే జూనియర్ ఎన్టీఆర్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇది త్వరలోనే ప్రారంభం అవుతుందని అంతా అనుకుంటోన్న సమయంలో.. దానిని కాదని మరో మూవీని లైన్‌లోకి తీసుకొచ్చాడతను. ఇందులో భాగంగానే గతంలో తనకు 'జనతా గ్యారేజ్' వంటి హిట్‌ను ఇచ్చిన కొరటాల శివతో సినిమాను ప్రకటించాడు.

పాన్ ఇండియా రేంజ్.. పూర్తి వివరాలు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా రేంజ్‌తో యూనివర్శల్ కాన్సెప్టుతో ఇది రూపొందనుంది. ఇందులో హీరోయిన్‌గా కియారా అద్వాణీని తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం త్వరలోనే ప్రారంభం కాబోతుంది.

ఎన్టీఆర్ - కొరటాల మూవీ షాకింగ్ అప్‌డేట్
క్రేజీ కాంబినేషన్ కావడంతో జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ ప్రాజెక్టు గురించి ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే చాలా ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఇలాంటి సమయంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఓ షాకింగ్ అప్‌డేట్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. అదే.. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరన్న దానిపై కొనసాగుతోన్న చర్చల సారాంశం అని టాక్.
Recommended Video

ఆ విషయంలో ఇద్దరిదీ చెరో మాట అని టాక్
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాకు కొరటాల శివ.. మణిశర్మను తీసుకుందామని భావిస్తున్నాడట. అయితే, జూనియర్ ఎన్టీఆర్ మాత్రం దేవీ శ్రీ ప్రసాద్‌తో వెళితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇద్దరూ చెరొకరి పేరును చెబుతుండడంతో దీనిపై క్లారిటీ రావట్లేదని అంటున్నారు. మొత్తానికి వీళ్లిద్దరి ఒకరు ఫిక్స్ అయ్యే అవకాశాలే ఉన్నాయట.


Click it and Unblock the Notifications











