ఆ రీమేక్ చేద్దామని రాజమౌళితో ఎన్టీఆర్...
రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి, యమదొంగ చిత్రాలు మూడూ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. దాంతో ఎన్టీఆర్ మరో సారి రాజమౌళి కాంబినేషన్ లో చేయటానికి ఉత్సాహం చూపెడుతూ అలనాటి క్లాసిక్ పాతాళభైరవిని చేయాలని ప్రపోజల్ పెట్టారని తెలుస్తోంది. ఎన్టీఆర్ తో విజయావారు కెవి రెడ్డి దర్శకత్వంలో రూపొందించిన పాతాళభైరవి అప్పట్లో పెద్ద సంచలనం. ఇప్పటికీ అది క్లాసిక్ గా అలరిస్తూనే ఉంది. యమదొంగ, మగధీర చిత్రాలతో జానపద గాధలను తెరపై అద్భుతంగా రాజమౌళి తీయగలని నిరూపింపబడటంతో ఈ ప్రపోజల్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని రీమేక్ చేయటం తో అన్ని వర్గాల ఆదరణను పొందవచ్చునని ఎన్టీఆర్ భావిస్తున్నాడని తెలుస్తోంది. ఇక ఇంతకుముందు కూడా సురేష్ ప్రొడక్షన్స్ వారు రాముడు భీముడు రీమేక్ ను ఎన్టీఆర్ తో తీయాలని ప్లాన్ చేసారని వినపడింది. అలాగే ఈ పాతాళభైరవి రీమేక్ కు సి కళ్యాణ్ నిర్మాతగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సి కళ్యాణ్ ప్రస్తుతం మహేష్, త్రివిక్రమ్ ల చిత్రానికి వర్కింగ్ ప్రొడ్యూసర్ గా సెట్స్ పై ఉంటున్నారు. అలాగే దాసరి,బాలకృష్ణ చిత్రానికి కూడా సి కళ్యాణ్ నిర్మాత అన్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











